రెండవ వారం కూడా అఖండ వీర విహారమే

Balakrishna Akhanda Movie Collections 2

నందమూరి బాలకృష్ణ.బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా టైటిల్‌ కు తగ్గ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Balakrishna Akhanda Movie Collections 2-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి.కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం అయ్యింది.

మొదటి వారంలో ఈ సినిమా కు ఏ ఇతర సినిమాలతో పోటీ లేకుండా పోయింది.సత్యదేవ్‌ మరియు నిత్యా మీనన్ నటించిన స్కైలాబ్ సినిమా విడుదల అయిన నేపథ్యంలో అఖండ కు కాస్త తక్కువ అవుతుందని కొందరు అనుకున్నారు.

 Balakrishna Akhanda Movie Collections 2-రెండవ వారం కూడా అఖండ వీర విహారమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అఖండ సినిమా ముందు స్కైలాబ్ నిలువలేక పోయింది.సత్యదేవ్ సినిమా నిరాశ పర్చింది.

నెగటివ్‌ టాక్ రావడంతో అఖండ కు కలిసి వచ్చింది.మొదటి వారంలో స్వైర విహారం చేయబోతున్న బాలకృష్ణ రెండవ వారంకు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా మందికి అనుమానంగా ఉంది.

Telugu Akhanda, Balakrishna-Movie

అసలు విషయం ఏంటీ అంటే తదుపరి వారంలో నోటెడ్‌ సినిమా లు ఏమీ రావడం లేదు.కనుక తదుపరి వారంలో కూడా అఖండ సినిమా విజయోత్సవం కొసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఇప్పటికే నమోదు చేసిన బాలయ్య బోయపాటి కాంబో రెండవ వారం లో కూడా ఇదే జోరు కొనసాగితే మాత్రం ఆల్‌ టైమ్ రికార్డు ల జాబితాలో కూడా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖండ సినిమా లో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో జగపతిబాబు మరియు శ్రీకాంత్‌ లు నటించారు.

ఇక ఈ సినిమా తో బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో మూడు సినిమాలు పూర్తి అయ్యాయి.అఖండ వంటి సినిమాలు వీరి కాంబోలో మరిన్ని రావాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

#Akhanda #Balakrishna #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube