బాలయ్య ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. మెగాను మించి!

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా స్టార్‌ చిరంజీవికి ఉన్న స్టార్‌ ఇమేజ్ బాలకృష్ణ కు కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.బాలకృష్ణ ఈమధ్యకాలంలో అంత రేంజ్ ను చూపించలేక పోతున్నాడు.

 Balakrishna Akhanda Movie Celebrations,latest News-TeluguStop.com

బాలయ్య సినిమా అంటే రాడ్ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో బాలయ్య చేస్తున్న ‘అఖండ ‘సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.మునుపటి ఉత్సాహంను అభిమానులు తెచ్చుకుని ఈ సినిమా కు స్వాగతం పలికారు.1990 ల్లో బాలయ్య అభిమానులు ఏ రేంజ్ లో సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అప్పట్లో బాలయ్య అభిమానుల హడావుడి బాలీవుడ్ సినిమా మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు పవన్‌ కళ్యాణ్ సినిమాలు మరియు ఇతర స్టార్‌ హీరోల సినిమా లు మాత్రమే హడావుడి కనిపిస్తుంది.

బాలయ్య సినిమా కు హడావుడి లేక కొన్నాళ్లు అయ్యింది.

Telugu Akhanda, Balakrishna, Balayya, Nandamuri Fans-Movie

బాలయ్య పనైపోయిందని అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అభిమానులు సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఈ హడావుడి.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా వందల కొద్ది ర్యాలీతో బాలయ్య అభిమానులు అఖండకు స్వాగతం పలికారు.అద్భుతమైన అఖండ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల విషయంలో రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అద్భుతమైన వసూళ్లు దక్కించుకున్న బాలయ్య గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.ఇప్పటికే సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చిన నేపథ్యంలో ప్రతి చోట కూడా రచ్చ ఇలాగే ఉంది.

ప్రతి బాలయ్య అభిమాని కూడా సెలబ్రేట్‌ చేసుకునే సందర్భం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మెగా మూవీస్ ను మించి ‘అఖండ ‘మూవీ సెలబ్రేషన్స్‌ కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube