కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలను విడుదల చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్లకు ధైర్యం సరిపోలేదు.అయితే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాత్రం ధైర్యం చేసి థియేటర్లలో అఖండ సినిమాను విడుదల చేశారు.
అఖండ సినిమా రిలీజ్ వల్ల చాలా నెలల తర్వాత థియేటర్లు కళకళలాడాయి.వకీల్ సాబ్ సినిమా తర్వాత మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసిన సినిమాగా అఖండ నిలిచింది.
అఖండ విజయం సాధించడంతో స్టార్ హీరో బాలకృష్ణ ఆలయ సందర్శన మొదలుపెట్టారు.అయితే అఖండ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ బాలయ్య అభిమానుల సంతోషానికి కారణమైంది.
బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ అఖండలో నటించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డులను క్రియేట్ చేస్తోంది.ఓవర్సీస్ లో అఖండకు 1 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి.

అఖండ కలెక్షన్లు ట్రేడ్ పండితులతో పాటు సాధారణ అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాయి.ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు 111 కోట్ల రూపాయలు కాగా షేర్ కలెక్షన్లు 64 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఏపీలోని కొన్ని ఏరియాలు మినహా దాదాపుగా అన్ని ఏరియాల్లో అఖండ లాభాల బాట పట్టింది.డిసెంబర్ లో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాల్లో రామ్ చరణ్ ధృవ సినిమా భారీ రికార్డును సొంతం చేసుకుంది.

ఐదేళ్ల క్రితం ఈ సినిమా 58 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.అయితే అఖండ మూవీ ఆ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతులు లేకపోయినా తక్కువ టికెట్ రేట్లతో అఖండ ఈ రికార్డులను సాధించింది.పాత టికెట్ రేట్లు అమలులో ఉండి ఉంటే మాత్రం అఖండ 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించేది.