బాలయ్యకు సూపర్‌ స్టార్‌ తో పోటీ తప్పేట్లు లేదుగా..!

Balakrishna Akhanda Movie And Mohan Lal Movie Clash

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా అఖండ.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంమైంది  .కరోనా కారణంగా వాయిదా పడుతూ రెండేళ్లుగా ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అవుతున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.అద్బుతమైన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేయబోతున్న సినిమా అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

 Balakrishna Akhanda Movie And Mohan Lal Movie Clash-TeluguStop.com

అంతే కాకుండా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని కూడా అంటున్నారు.అలా వంద కోట్ల సినిమా అఖండ అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సినిమా పై నమ్మకం మరింతగా పెరుగుతుంది.

డిసెంబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా కు పోటీ ఏమీ లేదని మొన్నటి వరకు అనుకున్నాం.కాని తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన సినిమా తో అఖండ కు పోటీ వచ్చేలా కనిపిస్తున్నాడు.

 Balakrishna Akhanda Movie And Mohan Lal Movie Clash-బాలయ్యకు సూపర్‌ స్టార్‌ తో పోటీ తప్పేట్లు లేదుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన నటించిన మరక్కర్ ను డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు.మొన్నటి వరకు మరక్కర్ సినిమా కేవలం ఓటీటీ లోనే విడుదల అవుతుందని భావించారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్‌ రిలీజ్ కు కూడా ఈ సినిమా సిద్దం అయ్యింది.తెలుగు లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు ప్రముఖ బయ్యర్ సిద్దం అయ్యాడని తెలుస్తోంది.

మలయాళంలో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా అని  చెబుతున్నారు.

మరి అంత రేంజ్ ఈ సినిమాకు ఉందో లేదో తెలియదు కాని ఖచ్చితంగా అఖండ కు మాత్రం ఈ సినిమా ఏదో ఒక స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.బాలయ్య అఖండ సినిమా తో పాటు ఆ మలయాళి సినిమా విడుదల అయితే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

#MOhan Lal #Balakrishna #Pragya Jaiswal #Boyapati #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube