అఘోరాను బయటపెట్టిన బాలయ్య.. కేక అంటోన్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తరువాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని చేయనున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేయాలని బాలయ్య చూస్తున్నాడు.

 Balakrishna Aghora Look Goes Viral-TeluguStop.com

ఈ క్రమంలో బోయపాటి అందించిన అదిరిపోయే కథతో బాలయ్య తన ప్రతాపాన్ని చూపించాలని అనుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో మరియు ఫ్యాక్షనిస్టు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.దీనికి సంబంధించి అఘోరా పాత్ర కోసం బాలయ్య ఇప్పటికే గుండు కొట్టించుకున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే తాజాగా బాలయ్య అఘోరా లుక్ ఇదేనా? అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటోలో బాలయ్య లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది.

తెల్లటి వెంట్రుకలు, నల్లటి మీసం గడ్డంతో బాలయ్య దర్శనమిచ్చాడు.

తాజాగా ఓ ఫ్యామిలీ పార్టీలో బాలయ్య ఇలా దర్శనమివ్వడంతో బాలయ్య లుక్‌పై ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరి ఈ లుక్‌తోనే బాలయ్య అఘోరాలా మారుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube