బాలయ్య పక్కకు పెట్టినా, వీళ్లు వదలడం లేదుగా!

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను బాలయ్య ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు.స్వయంగా నిర్మించేందుకు కూడా సిద్దం అయ్యాడు.

 Balakrishna About Ntr Biopic Movie-TeluguStop.com

స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందని భావిస్తున్న సమయంలో దర్శకుడు తేజ పక్కకు తప్పుకున్నాడు.ఈ సినిమాకు తాను న్యాయం చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడు.

దాంతో చేసేది లేక బాలయ్య మరో దర్శకుడి కోసం చాలా వెదికాడు.కాని సరైన దర్శకుడు ఈ సినిమాకు భించలేదు.దాంతో ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టి వినాయక్‌తో ఒక సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు

‘ఎన్టీఆర్‌’ సినిమా గురించి ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని, వినాయక్‌ దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత అప్పుడు తాను ఆ సినిమా గురించి ఆలోచిస్తాను అంటూ ప్రకటించాడు.బాలయ్య పూర్తి దృష్టి ప్రస్తుతం వినాయక్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపైనే ఉంది.కాని మీడియాలో మాత్రం ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి.వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నట్లుగా నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.కాని వార్తలు మాత్రం జోరుగా వస్తూనే ఉన్నాయి

నిన్న మొన్నటి నుండి ‘ఎన్టీఆర్‌’ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం చేసేందుకు ఓకే చెప్పాడని, త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తోన్న క్రిష్‌ ఆ తర్వాత ఈ చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ కొందరు మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఒక వైపు క్రిష్‌ మహాభారతం సినిమాను చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నాడు.కాని మీడియాలో మాత్రం ఎన్టీఆర్‌ సినిమాకు క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
మొత్తానికి ఎన్టీఆర్‌ సినిమాను బాలయ్య పక్కకు పెట్టినా కూడా మీడియా వారు మాత్రం ఆ సినిమాను పక్కకు పెట్టేలా లేదు.ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన రోజు ఏదో ఒక వార్త సోషల్‌ మీడియా లేదా వెబ్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది.

ఎన్టీఆర్‌ సినిమా చేయాలంటే బాలయ్య పూర్తి దృష్టి ఆ సినిమాపైనే పెట్టాల్సి ఉంటుంది.ఎందుకంటే లెక్కకు మించిన గెటప్స్‌తో పాటు, స్క్రిప్ట్‌లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.

వినాయక్‌ సినిమాను మొదలు పెట్టిన బాలయ్య మరో వైపు క్రిష్‌ దర్శకత్వంలో ఆ సినిమాను ఎలా చేస్తాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.వినాయక్‌ సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే బాలయ్య తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌ను నెత్తికి ఎత్తుకునే అవకాశం ఉంది.

అందుకే మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మనక్కర్లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్‌కు ఆ ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు