బాలయ్య ఓ పవర్ హౌజ్ అంటోన్న సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ నేడు 60వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ఆయనకు నందమూరి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును పండగలా చేస్తున్నారు.

 Balakrishna A Power House Says Mahesh Babu-TeluguStop.com

కాగా మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని, సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు అందరూ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.

ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

బాలయ్య ఎనర్జికీ పవర్ హౌజ్ లాంటి వ్యక్తి అని, నటుడిగా ఆయన్ను ఎప్పుడు అభిమానిస్తానని మహేష్ చెప్పుకొచ్చాడు.తనలోని ఎనర్జీ యంగ్ హీరోలకు పోటీగా ఉంటుందని మహేష్ అనడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

తమ హీరో పుట్టినరోజున ఇలాంటి కామెంట్స్ చేయడంతో మహేష్ బాబుకు వారు థ్యాంక్స్ చెబుతున్నారు.

ఏదేమైనా నందమూరి బాలకృష్ణ పట్టినరోజును ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇలా సెలబ్రిటీలు సైతం ప్రత్యేకంగా జరుపుకుంటుండటంతో నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఇక బాలయ్య తన ఫ్యాన్స్ కోసం రెండు గిఫ్టులను కానుకగా ఇవ్వగా అవి సోషల్ మీడియాలో ఎలా తుక్కు రేగ్గొడుతున్నాయో అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube