100 అనుకుంటే బాలయ్య 107కు కొట్టాడట!  

Balakrishna 107 Movie With Anil Ravipudi - Telugu Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Nbk107

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటాలని చూస్తున్నాడు బాలయ్య.

 Balakrishna 107 Movie With Anil Ravipudi

అయితే ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ చిత్రం కోసం పలువురు దర్శకులను క్యూలో పెట్టాడు.
ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యతో ఎప్పుడో ఓ సినిమా చేయాల్సింది.బాలయ్య 100వ చిత్రంగా అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయాల్సింది.కానీ ఆ సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికే ఓటేసిన బాలయ్య, అనిల్ రావిపూడితో తరువాత సినిమా చేద్దామని చెప్పాడట.ఇక అనిల్ కూడా ఈ సమయంలో ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న అనిల్ రావిపూడి, తన నెక్ట్స్ చిత్రాన్ని మాత్రం ఖచ్చితంగా బాలయ్యతోనే తెరకెక్కిస్తానని అంటున్నాడు.ఈ మేరకు బాలయ్యకు ఓ సబ్జెక్టును కూడా వినిపించాడని, బాలయ్య కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

100 అనుకుంటే బాలయ్య 107కు కొట్టాడట-Gossips-Telugu Tollywood Photo Image

అంటే బాలకృష్ణ 107వ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే డైరెక్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఖచ్చితమైన వార్త వినిపిస్తోంది.మరి బాలయ్యను మెప్పించే కథ ఎలా ఉండబోతుంది? అనిల్ రావిపూడి బాలయ్య లాంటి మాస్ హీరోను ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడనే ఆసక్తి అప్పుడే మొదలైంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు