అఖండ హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో బాలయ్య 107వ సినిమాకు సంబందించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ దునియా విజయ్ ని సెలెక్ట్ చేశారు.కన్నడ లో మంచి క్రేజ్ ఉన్న దునియా విలజ్ ని ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు సెలెక్ట్ చేశారు.
బాలకృష్ణ సినిమాలో విలన్లు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటారు.ఈ క్రమంలో దునియా విజయ్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.
బాలయ్య 107వ సినిమాకు మరోసారి థమన్ మ్యూజిక్ అందించనున్నారు.అఖండ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.
అందుకే మళ్లీ థమన్ కే ఆ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది.
సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీమలనలో ఉంది.