వైకాపా విజయంతో బాలయ్య 104వ సినిమా క్యాన్సిల్‌

నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ చిత్రంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నాడు.వంద కోట్లు వసూళ్లు చేస్తుందని భావించిన సినిమా కాస్త కనీసం 25 కోట్లు కూడా రాబట్టలేక పోయింది.

 Balakrishna 104th Movie Canceled 104-TeluguStop.com

ఆ సినిమా విడుదలై నాలుగు అయిదు నెలలు గడుస్తున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా దాని నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సమయంలోనే ఆయన 104వ సినిమాను తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.

సి కళ్యాణ్‌ బ్యానర్‌లో సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరగడంతో పాటు హీరోయిన్స్‌ ఎంపిక కూడా జరుగుతుంది.ఈ సమయంలోనే సినిమా క్యాన్సిల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

-Political

బాలకృష్ణ మరియు రవికుమార్‌ ల కాంబినేషన్‌లో ఇప్పటికే జైసింహా సినిమా వచ్చి నిరాశ పర్చింది.ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబో అంటే పెద్దగా ఆసక్తి లేదు.పైగా ఈ చిత్రం కథలోని విలన్‌ పాత్రలు రాజారెడ్డి మరియు రాజశేఖర్‌ రెడ్డిల నిజ జీవిత పాత్రలను పోలి ఉంటాయి.ఈ రెండు పాత్రల్లో కూడా జగపతిబాబు కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చింది.ఇలాంటి సమయంలో వారికి వ్యతిరేకంగా సినిమా తీస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

అందుకే బాలయ్య 104వ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

-Political

రవికుమార్‌ మరో స్క్రిప్ట్‌తో వస్తే పర్వాలేదు, ఈ లోపు దర్శకుడు బోయపాటి కొత్త కథతో వస్తే వెంటనే బాలయ్య ఆయనతో సినిమాను మొదలు పెడతాడని తెలుస్తోంది.మొత్తానికి బాలయ్య సినిమాకు వైకాపా అధికారంలోకి రావడం పెద్ద కష్టం వచ్చింది.బాలయ్య ఈమద్య కాలంలో సక్సెస్‌ అనేది చూసి చాలా ఏళ్లు అయ్యింది.

అందుకే ఆయన ఎలాగైనా సక్సెస్‌ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాడు.తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ సినిమాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

గతంతో పోల్చితే స్పీడ్‌ తగ్గించిన బాలయ్య సక్సెస్‌ కోసం చకోరా పక్షి తరహాలో ఎదురు చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube