బాలయ్య 102 సినిమా స్టొరీ లీక్..     2017-09-19   23:19:28  IST  Raghu V

-

-

సినిమా సెట్స్ మీదకు ఇలా వెళ్తుందో లేదో గానీ అలా సినిమా స్టొరీ లీక్ అవుతుంది.దర్శకుడు ఫుల్ సుస్పెన్సు ప్రేక్షకులకి ఇద్దాం అనుకుంటే..కధని లీకుల రూపంలో ఎవడో ఒకడు లీక్ చేసి దర్శకుడికి షాక్ ఇస్తున్నారు.ఎంత గోప్యంగా విషయాలని దాయాలని అనుకున్నా సరే ఎవడో ఒకడు లీక్ చేసి పడేస్తున్నాడు.ఇప్పుడు బాలయ్య బాబు 102 సినిమా కూడా ఈ లీకుల వాళ్ళ బారిన పడింది.సినిమా మొదలైన కొద్ది రోజులకే ఇలా కధ లీకవ్వడం తో సినిమా యూనిట్ షాక్ అయ్యారు.ఇంతకీ కదా ఏమిటో మనము చూద్దాం.

సోషల్ మీడియాలో వస్తున్న కధ తాలూక వివరాల ప్రకారం.బాలకృష్ణ ,నయనతార ఇద్దరు ప్రేమించుకుంటారు..పెళ్లి చేసుకోవాలని అనుకున్న టైం లో వేరే కారణాలవల్ల ఇద్దరూ విడిపోతారు.బాలకృష్ణ నయన్ కోసం వెతుకుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నయనతారకి మరొకరితో పెళ్లి జరిగిపోతుంది.వారికి ఒక పాప కుడా పుడుతుంది.ఇలా 20 గడిచిన తరువాత నయన్ కూతురు వెనక కొంతమంది రౌడీలు వెంటపడుతారు..వారినుంచి తప్పించుకునే క్రమంలో బాలకృష్ణ చెంతకు చేరుతుంది. తనకి ఎవరూ లేరు అని చెప్పడంతో బాలయ్య తన కూతురులా పెంచుకుంటాడు. అసలు నయన్,బాలయ్య ఎందుకు విడిపోతారు? నయన్ ని పెళ్లి చేసుకున్న వ్యక్తీ ఎవరు? ఆ పిల్ల వెనకాల వాళ్ళు ఎందుకు పడుతారు ?నయనతార బ్రతికే ఉంటుందా? అనే సస్పెన్స్ లో సాగే కధ ఇది అని టాక్ .

ఇంతకుముందు కధ ప్రకారం చుస్తే నయనతార బాలకృష్ణ కి తల్లిగా నటిస్తోంది అని ,నటాషా హీరోయిన్ గా చేస్తోంది అని అన్నారు ..కానీ తాజాగా వైరల్ అవుతున్న ఈ కధ ప్రకారం నటాషా నయన్ కూతురు అని ఈ కధ లో నటాషా పాత్రే చాలా కీలకం అని టాక్.మరి రోజుకో కధ లీకుతో వైరల్ అవుతున్న ఈ గాసిప్స్ చివరకి ఎటువంటి కధ కి ఫిక్స్ అవుతాయో..అన్నట్టు ఈ సినిమాకి జయసింహా అనే పేరు కూడా పెట్టారు అని టాక్..వీటికి క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి.