నందమూరి బాలకృష్ణ( Balakrishana ) ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం లో సినిమా ను చేస్తున్నాడు.అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక బాలయ్య 109వ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యింది.ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్( Sitara Entertainments banner ) లో ఈ సినిమా రూపొందబోతుంది.
బాలయ్య మరియు బాబీ కాంబో లో ఈ సినిమా ను సితార వారు నిర్మించబోతున్నారు.ఇక ఈ సినిమా యొక్క నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమా తో బాబీ ( Director Bobby ) సూపర్ హిట్ అందుకోవడంతో వెంటనే ఈ సినిమా ను చేసే అవకాశం ను దక్కించుకున్నాడు.మరో వైపు బాలయ్య మరియు బాబీ కాంబో మూవీ లో ఒక గెస్ట్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య మరియు బాబీ కాంబో మూవీలో కీలక పాత్రను రవితేజ చేయబోతున్నాడు.
ఆ మధ్య టాక్ షో లో బాలయ్య తో రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పుడు బాబీ దాన్నే ప్లాన్ చేస్తున్నాడట.

వాల్తేరు వీరయ్య సినిమా లో రవితేజ నటించడం వల్ల ఏ స్థాయి లో క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే బాలయ్య సినిమా లో కూడా రవితేజ ను నటింపజేస్తే బాగుంటుందని బాబీ భావించడం.అందుకు సితార వారు మరియు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అయినా కూడా బాలయ్య సినిమా లో నటించేందుకు బాబీ అడిగిన వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.