'అఖండ' అభినందనలు అందుకున్న పీవీ సింధు

నందమూరి బాలకృష్ణ ఫేస్‌ బుక్‌ లో ఒలింపిక్స్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.ఇటీవల బ్యాడ్మింటన్ లో కాంస్యం పథకంను దక్కించుకుని భారత క్రీర్తి పతాకాన్ని బ్యాడ్మింటన్ రంగంలో రెపరెపలాడించిన పీ వీ సింధును ఎంతో మంది అభినందించారు.

 Balakrishana About P V Sindu Winning In Fb Post-TeluguStop.com

ఇప్పుడు అదే విధంగా బాలకృష్ణ కూడా తనవంతు బాధ్యతతో పీ వీ సింధుకు అభినందనలు తెలియజేశాడు.తనదైన శైలిలో పీ వీ సింధు గురించి ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌ పెట్టాడు.

Telugu Akhanda News, Balakrishana About P V Sindu, Balakrishna, Film News, Movie News, P V Sindhu-Movie

బాలకృష్ట ఫేస్ బుక్ లో.ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత దేశ పతాకాన్ని మరోసారి ఎగురవేసిన మన తెలుగు తేజం పీ వీ సింధు కి నా శుభాభినందనలు.తన ఈ విజయం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలని.మరెందరో పీ వీ సింధు మాదిరిగా భారత దేశంకు పతకాలు తీసుకు రావాలని పేరు ప్రతిష్టలను తెచ్చి పెడతారని ఆశిస్తున్నాను అంటూ బాలయ్య పోస్ట్‌ చేశాడు.

 Balakrishana About P V Sindu Winning In Fb Post-అఖండ’ అభినందనలు అందుకున్న పీవీ సింధు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్‌ లో ఉన్నాడు.ఇటీవలే చెన్నైలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.అందుకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడంతో తుది షెడ్యూల్‌ కు సినిమా ను ప్లాన్‌ చేస్తున్నారు.దాంతో ప్యాచ్‌ వర్క్ ను ముగించి సినిమా ను విడుదలకు సిద్దం చేస్తారని అంటున్నారు.

దసరా కానుకగా విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.అఖండలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

పూర్ణ కూడా కీలక పాత్ర లో కనిపించబోతుంది. అఖండ సినిమా తో బోయపాటి మరో భారీ సూపర్‌ హిట్ ను ఖచ్చితంగా బాలయ్యకు ఇస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

#Akhanda #Sindhu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు