బాలయ్య 'ఆహా' టాక్‌ షో గెస్ట్‌ లు ఎవరో తెలిసి పోయింది

నందమూరి బాలకృష్ణ ఆహా కోసం టాక్ షో చేయబోతున్నాడు అనేది కన్ఫర్మ్‌ అయిన వార్త.ఆహా వారు స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

 Balakrishan Aha Talk Show Guest List-TeluguStop.com

ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న బాలయ్య టాక్ షో గురించి అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఆహా వారు టాక్ షో లకు బాప్ వంటి షో.ఖచ్చితంగా పైసా వసూల్‌ షో అంటూ హామీ ఇస్తున్నారు.ఈ నేపథ్యం లో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దసరాకు బాలయ్య ఆహా షో ప్రోమో విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రోమో ఓకే గాని బాలయ్య టాక్ షో లో కనిపించేది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Balakrishan Aha Talk Show Guest List-బాలయ్య ఆహా’ టాక్‌ షో గెస్ట్‌ లు ఎవరో తెలిసి పోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా హీరోలు ఈ టాక్ షో కు వస్తారా.ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్ రామ్‌ లను తన షో కు బాలయ్య రప్పిస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Telugu Aha Talk Show, Balakrishna, Balaya Show In Aha, Movie News-Movie

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాక్ షో కు ఫస్ట్‌ గెస్ట్‌ గా మోహన్ బాబు రాబోతున్నాడు.ఈమద్య కాలంలో ఈయన పేరు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది.ఎందుకంటే ఈయన వివాదాలకు కేంద్ర బింధువుగా ఎక్కువగా ఉంటాడు.అందుకే ఈయన్ను జనాలు బాలయ్య ఇంటర్వ్యూలో చూడాలని ఖచ్చితంగా కోరుకుంటారు.ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్ ను కూడా ఈ షో కు ఆహ్వానిస్తారనే వార్తలు వస్తున్నాయి.చిరంజీవి మరియు బాలయ్య ల మద్య గత మూడు దశాబ్దాలుగా కోల్డ్‌ వార్‌ నడుస్తుందని అంటూ ఉంటారు.

కాని వారిద్దరు కలిసి ప్రతి సారి కూడా బయట చాలా సరదాగా మాట్లాడుకుంటారు.కనుక బాలయ్య షో కు చిరంజీవిని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి.

ఆహా అల్లు అరవింద్ కాంపౌండ్‌ ది కనుక చిరంజీవి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.ఇక దర్శకులు రాఘవేంద్ర రావు మరియు బోయపాటితో పాటు మరో ఇద్దరు ప్రముఖులు కూడా వస్తారని తెలుస్తోంది.

మొత్తంగా టాక్ షో మొదటి సీజన్ లో భాగంగా 12 మంది సెలబ్రెటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నాడు.ఈ షో కు క్రిష్ డైరెక్షన్ అనే విషయం తెల్సిందే.

#Balakrishna #Aha #Balaya Aha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు