ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి సినిమాలలో బలగం ( Balagam ) సినిమా ఒకటి.జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన వేణు( Venu ) జబర్దస్త్ కార్యక్రమానికి దూరమై డైరెక్టర్ గా మారారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి బలగం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ప్రియదర్శి ( Priyadarshi ) కావ్య కళ్యాణ్ రామ్( Kavya Kalyan Ram ) జంటగా దిల్ రాజు( Dil Raju ) నిర్మాణంలో హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.,
ఈ విధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక తెలంగాణలోనే మారుమూల ప్రాంతంలో కూడా పల్లెటూర్లలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున స్క్రీన్లను ఏర్పాటు చేసి ఈ సినిమాని చూసి విడిపోయిన కుటుంబ సభ్యులు కూడా కలుసుకున్నారు.అంతగా ఈ సినిమా ప్రజలపై ప్రభావం చూపించింది.ఇకపోతే ఈ సినిమా ఎంతోమంది సినీ ప్రేమికులను ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.
ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుకుంది.ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై ఏకంగా 100 అవార్డులను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.పలుదేశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలలో ఈ సినిమా వివిధ భాగాలలో ఎంపిక అవుతూ అవార్డులను అందుకుంది.ఇలా అంతర్జాతీయ వేదికపై ఏకంగా 100 అవార్డులను అందుకొని ఈ సినిమా సంచలనమైన రికార్డు సృష్టించినదని చెప్పాలి అయితే ఇప్పటివరకు ఇలాంటి ఘనత ఏ సినిమాకి కూడా దక్కకపోవడం గమనార్హం.