భారత్ ఆశ్రయం పొందిన ఇమ్రాన్ మాజీ సహచరుడు  

Baladev Kumar Lands In India With Family For Indian Help-baladev Kumar In India,imran Khan,imran Khan\\'s Ex Colleague

పాక్ లో రక్షణ లేదు అంటూ భారత్ ఆశ్రయం పొందిన ఇమ్రాన్ మాజీ సహచరుడుపొరుగుదేశం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సహచరుడు బలదేవ్ కుమార్ భారత్ ఆశ్రయం పొందాడు.ఒకప్పుడు ఇమ్రాన్ కు సహచరుడు గా వ్యవహరించిన బలదేవ్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ ఇన్సాఫ్ ఎమ్మెల్యే గా కూడా వ్యవహరించారు.అయితే పాక్ లో తనకు ఎలాంటి రక్షణ లేదని తన కుటుంబం తో సహా భారత్ చేరుకున్న ఆయన తనకు రాజకీయ శరణు కల్పించాలి అంటూ కోరుతున్నట్లు తెలుస్తుంది...

Baladev Kumar Lands In India With Family For Indian Help-baladev Kumar In India,imran Khan,imran Khan\'s Ex Colleague-Baladev Kumar Lands In India With Family For Indian Help-Baladev Imran Khan Imran Khan\'s Ex Colleague

పాక్ లోని బారికోట్ నుంచి గతంలో ఈయన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అయితే ఒకప్పుడు ఇమ్రాన్ కు సహచరుడిగా వ్యవహరించిన 43 ఏళ్ల బలదేవ్ తమ దేశంలో హిందువులు, సిక్కులతో సహా మైనారిటీలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇమ్రాన్ ఖాన్ పాలనలో వారిని అదేపనిగా ప్రాసిక్యూట్ చేయడం ఎక్కువైందంటూ ఆయన అంటున్నారు.అలానే 2016 లో తనపై తప్పుడు మర్డర్ కేసు పెట్టారంటూ బలదేవ్ ఆరోపిసున్నాడు.బలదేవ్ నియోజకవర్గంలో సొరన్ సింగ్ అనే ఎమ్మెల్యే హత్యకు గురైన సంగతి తెలిసిందే.

అయితే ఈ హత్య బలదేవ్ చేసినట్లు ఆరోపించారు, అయితే ఈ ఆరోపణలపై కోర్టు ను ఆశ్రయించగా 2018 లో బలదేవ్ ని కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టారు.

Baladev Kumar Lands In India With Family For Indian Help-baladev Kumar In India,imran Khan,imran Khan\\'s Ex Colleague-Baladev Kumar Lands In India With Family For Indian Help-Baladev Imran Khan Imran Khan\\'s Ex Colleague

ఇటీవలి కాలంలో పాక్ లో హిందూ, సిక్కు, క్రిస్టియన్ అమ్మాయిలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారుస్తున్నారని, ముస్లిం యువకులతో వారి పెళ్లి జరిపిస్తున్నారని చెప్పాడు.తన కుటుంబంతో బాటు బలదేవ్ ప్రస్తుతం లూథియానా సమీపంలోని ఖన్నా అనే ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తుంది.