బాల 'అర్జున్‌ రెడ్డి' ఎలా ఉన్నాడంటే..?

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ మూవీ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేయగా సూపర్ హిట్ దక్కించుకుంది.తమిళంలో కూడా ఈ సినిమాను ఆదిత్య వర్మ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ పొందడం జరిగింది.

 Bala Version Arjun Reddy Remake Varma Review  ,  Arjun Reddy Remake ,actor Vikra-TeluguStop.com

తమిళ్ రీమేక్ విషయంలో అనేక విషయాలు చోటుచేసుకున్నాయి.అర్జున్ రెడ్డి రీమేక్ ని రెండు సార్లు షూట్ చేయడం జరిగింది.

మొదటగా జాతీయ అవార్డు గ్రహీత బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్‌ షూటింగ్ జరిగింది.షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత విక్రమ్ రషెస్ చూసి ఇది వర్కౌట్ అయ్యేలా లేదని అంతా కొత్త వారితో మళ్లీ చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు.

బడ్జెట్ వృధా అయినా కూడా ఈ సినిమాను బయటకు విడుదల చేస్తే తన తనయుడు ధ్రువ సినీ కెరియర్ కి మచ్చగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.అందుకే షూటింగ్‌ చేసినదంతా పక్కకు పెట్టి మళ్ళీ అర్జున్ రెడ్డి సహాయ దర్శకుడిగా వ్యవహరించిన గిరీషయ్య అనే దర్శకుడితో సినిమాను రూపొందించారు.

అనుకున్నట్లుగానే ఆదిత్య వర్మ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.బాలా రూపొందించిన వర్షన్‌ ‘వర్మ’ను ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

జాతీయ అవార్డు గ్రహీత అయిన బాల అర్జున్ రెడ్డి ని ఎలా తెరకెక్కించి ఉంటాడు అంటూ అంతా ఆసక్తిగా చూశారు.సినిమా విడుదల తర్వాత బాబోయ్ ఇది థియేటర్లలో విడుదల కాకపోవడమే మంచిది అయింది.

ఒకవేళ ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే విక్రమ్ తనయుడు ధ్రువ సినీ కెరియర్ మొదటి సినిమాతోనే ముగింపు అయ్యేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాను అర్జున్ రెడ్డి లా కాకుండా మరోలా తనదైన శైలిలో చిత్రీకరించడం వల్ల సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమా ను బోల్డ్ గా చిత్రీకరిస్తే ప్రేక్షకులు చూస్తారు ఎందుకంటే ఆ కథ అలా ఉంటుంది.కాని దర్శకుడు బాల మాత్రం మొహమాటంతో కాస్త అటు ఇటుగా చిత్రీకరించాడు.

ఓటీటీలో చూసిన ప్రేక్షకులు దీనిని థియేటర్లలో చూడక పోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆదిత్య వర్మకు బాలా వర్మకు చాలా తేడా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరో విక్రమ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని బడ్జెట్ వృధా అయినా కూడా ఈ సినిమాను విడుదల చేయక పోవడమే మంచిదయ్యిందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube