అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఏకంగా లారీతో…  

Bala Subramanyam Chittoor News Chittoor Crime News - Telugu Bala Subramanyam, Chittoor Crime News, Chittoor News, Married Women News, Married Women Planned To Kill His Husband

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాన్ని బుగ్గి పాలు చేసుకుంటున్నారు.తాజాగా ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంగా తన భర్తని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో చోటు చేసుకుంది.

 Bala Subramanyam Chittoor News Chittoor Crime News

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలో బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి ఇటీవలే ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లైన మొదట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఇందుకుగాను వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.అయితే ఏమైందో ఏమో కానీ ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం మరియు అతని భార్య మధ్య తగవులు చోటు చేసుకున్నాయి.

అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఏకంగా లారీతో…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో  వివాహిత స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే ఈ విషయం గురించి తెలుసుకున్నటువంటి ఆమె భర్త పలుమార్లు వీరిద్దరి బంధం గురించి హెచ్చరించినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు.

అంతేగాక తరచూ ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారు.అయితే తాజాగా ఈ విషయంపై మరోసారి గొడవపడగా ఈ విషయాన్ని తన ప్రియుడితో చెప్పింది.దీంతో ఇద్దరూ కలిసి బాలసుబ్రమణ్యం ని హత్య చేయడానికి కి పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా డబ్బు కోసం హత్యలు చేసేటువంటి వ్యక్తులతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

అయితే ప్లాన్ లో భాగంగా భర్త బయటకు వెళ్లిన సమయంలో లారీతో ప్రమాదం సృష్టించి దారుణంగా హత్య చేశారు. అయితే ప్రమాదం జరిగిన అనంతరం విచారణలో భాగంగా పోలీసులకు ఈ విషయాలు తెలిసినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Married Women Planned To Kill Her Husband Related Telugu News,Photos/Pics,Images..