రిలీజ్ ముందే అవార్డులు గెలుచుకున్న నెగెటివ్..!

70MM తెర మీద చూస్తేనే సినిమా కాదు సెల్ ఫోన్ స్క్రెన్ మీద కూడా సినిమా ఆడించే రోజులు వచ్చేశాయి.ఓటీటీలు వచ్చాక సినిమా అనేది ప్రేక్షకుడికి మరింత దగ్గరగా చేరింది.

 Bala Satish Negative Movie Selected For Film Festivals , Bala Sathish , Director-TeluguStop.com

థియేటర్ లో ఆడే బొమ్మలే కాదు ఓటీటీలో వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.మంచి అవకాశం కోసం ఎదురుచూసే ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ముందు తమకు వచ్చిన ఛాన్సులతో వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అలాంటి టాలెంటెడ్ పీపుల్ లో ఒకరు సతీష్ బాల.పలు సినిమాలకు రైటర్ గా ముఖ్యంగా తమిళ డబ్బింగ్ సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఆయన మొదటిసారి మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా నెగెటివ్.

విక్రం శివ, బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో దయానంద రెడ్డి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.రిలీజ్ ముందే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకుంది.

ఈ సినిమా అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కళాకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్ ఆఫ్ సెషన్స్ ఆన్ లైన్ అండ్ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిస్ట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్క్, ఫిల్మ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి వాటికి అధికారికంగా సెలెక్ట్ అయ్యింది.ఫిలోమినా ఇన్ఫోటైన్మెంట్స్ బ్యానర్ లో ఏ.ఎం రాజేష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

లైఫ్ లో కేవలం పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ వెబ్స్ మాత్రమే కాదు కొన్నిసార్లు నెగెటివ్ వర్డ్ కూడా ఇష్టడాల్సి వస్తుంది.

అదేంటో ఈ సినిమాలో చూడాలి అంటున్నారు బాలా సతీష్.తప్పకుండా ఈ సినిమా ఈ డైరక్టర్ కి మంచి డెబ్యూ అవుతుందని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube