Bala murali krishna : బాల మురళి కృష్ణ హీరోగా నటించిన సినిమా ఏంటో తెలుసా ?

బాల మురళీ కృష్ణ దేశం మొత్తం గర్వించే సంగీత విద్వాంసుడు.శాస్త్రీయ సంగీతం పేరు చెబితే అయన రెండు చెవుల కోసుకుంటారు.

 Bala Murali Krishna Movie As Hero ,bala Murali Krishna, Tollywood, Kannda Movie,-TeluguStop.com

బాల మురళి కృష్ణ అందుకున్న సత్కారాలు, పొందిన గౌరవం ఎంతో గొప్పది.ఇక అయన చేసిన ఎన్నో కచేరీల వల్ల దేశ విదేశాల్లో అనేక పాటలను పాడి తనదైన రీతిలో శాస్త్రీయ సంగీతాన్ని నలు దిక్కుల ప్రచారం చేస్తూ వచ్చారు.

అయితే బాల మురళీ కృష్ణ కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు.ఆయన కొన్ని సినిమాలకు సంగీతం కూడా అందించారు.

అలాగే పలు సినిమాల్లో పాటలు కూడా పాడారు.అయితే ఇక్కడ వరకు చాలామందికి తెలిసిన విషయాలే.

కానీ ఆయన సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు ఒక నటుడు అనే విషయం ఎవరికి తెలియదు.అంతేకాదు ఆయన హీరోగా కూడా ఒక కన్నడ సినిమాలో నటించారు.

శంకరాభరణం సినిమాకి స్వయంగా తనకు సంగీతం అందించే అవకాశాన్ని ఇవ్వాలని విశ్వ నాథ్ ని కోరుకున్నారట బాల మురళీ కృష్ణ.కానీ ఏవో కారణాల చేత అది సాధ్య పడలేదు.

ఇక ఎన్ని కాలాలు గడిచిన, ఎన్ని ప్రయాణాలు చేసినా కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే నిలబడుతుంది అని బలంగా నమ్మి వ్యక్తి బాల ముర ళీకృష్ణ.అయితే ఆయనకు శంకరాభరణం సినిమా కన్నా కూడా విశ్వనాధ్ తీసిన శృతి లయలు సినిమా అంటే ఎంతో ఇష్టమట.

Telugu Anajali Devi, Balamurali, Bhakta Prahlada, Satyagindena-Latest News - Tel

ఇక ఆయన భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా నటించారు.ఆ తర్వాత ఒక కన్నడ సినిమా కోసం హీరోగా కూడా నటించారు అదే సత్య గిందెన సిందూరం.ఈ సినిమాలో సైతం ఆయన సంగీత విద్వాంసుని పాత్రలో నటించడం విశేషం.సంగీతం అంటే డబ్బు కోసం కచేరీలు చేసుకోవడానికి కాదని చాటి చెప్పే పాత్రలో ఆయన నటించి మెప్పించారు.

అందుకే అనాధ పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటారు ఈ చిత్రం లో.ఇక ఈ సినిమాలో బాల మురళి కృష్ణ సరసన హీరోయిన్ గా నటి సీమ చేసింది.ఈ సినిమా తర్వాత మళ్లి అయన ఎక్కడ నటించకపోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube