నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి త్రాగితే 2 నిమిషాల్లో శరీరంలో ఏ మార్పు కలుగుతుందో తెలుసా?

సాధారణంగా బేకింగ్ సోడాను వంటల్లో వాడుతూ ఉంటాం.అలాగే అనేక బేకరీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

 Baking Soda Health Benefits-TeluguStop.com

బేకింగ్ సోడాను వంటల్లో ఉపయోగించటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ బేకింగ్ సోడాతో ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బేకింగ్ సోడాలో సహజసిద్ధమైన అంటాసిడ్ లక్షణాలు ఉంటాయి.

ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలిపి త్రాగితే అసిడిటీ సమస్య దూరం అవుతుంది.తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కడుపులో ఆమ్లాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి.

దాంతో గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి.


కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకి ఉంది.అందువల్ల ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని త్రాగితే కిడ్నీలో రాళ్ళూ క్రమంగా మూత్రం ద్వారా బయటకు పోతాయి.

పురుగులు కుట్టినప్పుడు దురద,మంట,నొప్పి ఉండటం సహజమే.ఇలాంటి సమయంలో బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ చేసి పురుగు కుట్టిన ప్రదేశంలో రాస్తే కలుగుతుంది.

కొంచెం బేకింగ్ సోడాను నీటిలో కలపాలి.ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి చెమట వచ్చే ప్రదేశాలలో రాస్తే డియోడ‌రంట్‌ గా పనిచేసి చెమట దుర్వాసన నుండి ఉపశమనం కలుగుతుంది.

బేకింగ్ సోడా, నీరు క‌లిపిన మిశ్ర‌మంతో చేతులను క‌డుక్కుంటే స‌బ్బుతో ల‌భించే శుభ్ర‌త ల‌భిస్తుంది.దీంతో మురికిపోవ‌డ‌మే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube