వావ్ 'క్యూట్' ! ఈ బుల్లి 'కారు' మనకూ... అందుబాటులోకి రాబోతోంది !

ఇప్పటి వరకు కేవలం విదేశాలకు మాత్రమే … ఎగుమతి అవుతూ వస్తున్న మేడిన్ ఇండియా బజాజ్ క్యూట్ ఇప్పుడు … భారతీయ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది.ప్రభుత్వం ఈ నాలుగు చక్రాల క్వాడ్రిసైకిల్ ని వ్యక్తిగత ఉపయోగానికి అనుమతినిచ్చింది.

 Bajaj New Cute Car In Indian Roads-TeluguStop.com

క్వాడ్రిసైక్ గురించి రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.బజాజ్ క్యూట్ ని 2012 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు.

అప్పుడు దీనిని ఆర్ఈ60 కోడ్ పేరుతో ప్రదర్శించారు.ఇందులో 216సీసీ సింగిల్ సిలిండర్, వాటర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు.ఇది 13పీఎస్ పవర్, 18.9ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు.క్యూట్ ఇంజన్ ను మోటార్ సైకిల్ మాదిరిగా 5-స్పీడ్ గేర్ బాక్స్ తో కలిపారు.ఇందులో సీఎన్జీ, ఎల్పీజీ ఫ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయి.

క్యూట్ క్వాడ్రిసైకిల్ గంటకు 70 కి.మీల టాప్ స్పీడ్ తో నడుస్తుందని బజాజ్ నమ్మకంగా చెబుతోంది.ఇది 35కెఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.రవాణా మంత్రిత్వశాఖ ప్రకారం క్వాడ్రిసైకిల్ కేటగిరీకి చెందిన వాహనాలు ఎక్స్ ప్రెస్ వేలలో నడపకూడదు.దీనిని నాలుగు, అంత కంటే ఎక్కువ లైన్ల హైవేపై కూడా గంటకు 60కి.మీల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు.

నగరాల్లో దీని గరిష్ఠ వేగాన్ని గంటలకు 50కి.మీలుగా నిర్ణయించారు.

దీని పొడవు 2752ఎంఎం, వెడల్పు 1312ఎంఎం, ఎత్తు 1652ఎంఎం.దీని వీల్ బేస్ 1925ఎంఎం.టర్నింగ్ రేడియస్ కేవలం 3.5మీటర్లు మాత్రమే కావడంతో ఇరుకైన, రద్దీగా ఉండే వీధుల్లో సులువుగా నడిపేందుకు వీలుకుదురుతుంది.అయితే.ఇందులో నలుగురు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా … ఈ క్యూట్ లో 2+2 కాన్ఫిగరేషన్ ఇచ్చారు.దీని బరువు 400 కిలోలు మాత్రమే.దీని ధర రూ.1.5-2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube