అధునాతన సాంకేతికత కలిగి బజాజ్ పల్సర్ సరికొత్త మోడల్ బైక్.. చూస్తే వావ్ అంటారు.. !

బైక్అంటే యువతకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు.అందులో కొత్త మోడల్ వాహనాలు వచ్చాయంటే ఉషారులో ఉన్న యువతలో ఫుల్ జోష్ నిండి ఆ బైక్ కొనేదాగా నిద్రకూడా ఉండదు.

 Bajaj Launches New Pulsar Bajaj, Launches, New Pulsar 180, Delhi-TeluguStop.com

అందుకే వీరి ఆసక్తికి తగ్గట్టుగా వాహనాల సంస్దలు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేసి ఈ పోటీరంగంలో నిలదొక్కుకుని లాభాల బాటలో ప్రయాణించడానికి ఎప్పుడు సిద్దంగా ఉంటాయి.

ఇకపోతే దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తన పల్సర్ 180 కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.దీని ధరను (ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)లో రూ.1,07,904గా నిర్ణయించినట్టు బజాజ్ ఆటో మంగళవారం తెలిపింది.

ఇకపోతే ఎక్కువగా భారత మార్కెట్లో 20 శాతం ఉన్న స్పోర్ట్స్ బైక్ విభాగంలో 180-200 సీసీ మోటార్ సైకిళ్లే ఉన్నాయని బజాజ్ ఆటో ఈ సందర్భంగా పేర్కొంది.కాగా ఈ బైక్ బ్లాక్ అలోయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ సస్పెన్షన్, 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్, బ్యాక్ సస్పెన్షన్‌లో షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది.

అయితే ఉత్తమమైన స్పోర్ట్స్ బైక్‌ను వెతికే కస్టమర్ల ను ఆకర్శించే విధంగా ఈ బైక్‌ను తయారు చేశామని వాళ్లు తెలియచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube