అదిరిపోయిన బజాజ్ చేతక్ బుకింగ్స్..!

1970 నుండి 1990 వరకు ఇండియాలో అత్యధిక అమ్మకాలు కలిగిన స్కూటర్ బజాజ్ చేతక్.ఆ టైం లో బజాజ్ చేతక్ ఓ వెలుగు వెలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Bajaj Chetak Electric Scooter Super Bookings-TeluguStop.com

ఆ తర్వాత కొత్తరకం వాహనాలు వచ్చి దాన్ని వెనక్కి నెట్టేశాయి.అమ్మకాలు తగ్గడంతో వాటి ఉత్పత్తిని ఆపేశారు.

అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బజాజ్ చేతక్ స్కూటర్ ఇప్పుడు కొత్త హంగులతో వస్తుంది.కొత్త మోడల్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వేరియెంట్ గా వస్తుంది.

 Bajaj Chetak Electric Scooter Super Bookings-అదిరిపోయిన బజాజ్ చేతక్ బుకింగ్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవుతున్న ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ నెల 13న ప్రారంభించారు.

ఈసారి రెండు వేరియెంట్లలో ఈ స్కూటర్ విడుదల అవుతుంది.ప్రీమియం ధర 1.26 లక్షలు ఫిక్స్ చేశారు.అర్బన్ ధర 1.22 లక్షలుగా ఉంటుందని సంస్థ నిర్ణయించింది.అయితె మొదటి విడతగా బజాజ్ చేతక్ డెలివెరీ చేయాలని అనుకున్న స్కూటర్ల యూనిట్ల సంఖ్యతో చూస్తే అడ్వాన్స్ బుకింగ్స్ అధికంగా అయ్యాయి.కేవలం 48 గంటల్లోనే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని తెలుస్తుంది.

అందుకే సంస్థ బజాజ్ చేతక్ బుకింగ్స్ ని ఆపేసింది.కస్టమర్ల నుండి వచ్చిన స్పందన చూసి ఈడీ రాకేశ్ శర్మ తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

పూణె, బెంగుళూరులో మాత్రమే ఈ బుకింగ్స్ ఓపెన్ చేశారు.త్వరలో బుకింగ్స్ చేసిన కస్టమర్స్ కు వాహనాలను అందిస్తామని అన్నారు.

ప్రొడక్షన్ మరింత పెంచి దేశం మొత్తం ఈసారి బుకింగ్స్ ఇంకా వెహికల్స్ అందిస్తామని అన్నారు.బజాజ్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలో వాట్ పవర్ తో పనిచేస్తుందని తెలుస్తుంది.16.2 ఎన్.ఎం పీక్ టార్క్, 1400 ఆర్.పీ.ఎం కలిగిఉంటుంది.గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చని చెబుతున్నారు.ఒకసారి ఫుల్ చార్జింగ్ తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలుస్తుంది.

#Bajaj Chetak #BookingsFor #BajajChetak #Super Bookings #Bajaj Vehicles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు