రేపే విడుదల ! బయటకు రాబోతున్న చింతమనేని !

తెలుగుదేశం పార్టీలో వివాదాస్పద నాయకుడిగా పేరుపడ్డ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివిధ కేసుల్లో అరెస్టయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు.తాజాగా ఆయనకు ఎస్సీ ఎస్టీ కేసుల్లో జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది.

 Bail Granted To Chintamaneni Prabhakar-TeluguStop.com

దీంతో ఆయన 16వ తేదీ శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇసుక తవ్వకాల వ్యవహారంలో తను కులం పేరుతో చింతమనేని దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించారు అంటూ చింతమనేని పై పినకడిమి కి చెందిన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో చింతమనేని అనుచరులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.ఆ తరువాత ఆయన పరారయ్యారు.

ఆ తరువాత ఆయన భార్యకు అనారోగ్యం చేయడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాల లోని తన నివాసానికి చేరుకున్న సమయం పోలీసులు అరెస్టు చేశారు.బయటకి వచ్చిన తరువాత ఆయన ఏ విధంగా స్పందిస్తారో , తెలుగుదేశం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

కొద్ది రోజుల క్రితమే చింతమనేని విడుదల కాబోతున్నారనే విషయం బయటకి వచ్చేలా ఆయన అనుచరులు కొంతమంది ఏలూరులో ‘త్వరలో సింహం మీ ముందుకు’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube