'బాహుబలి' మళ్లీ థియేటర్లకు వస్తుంది

తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సినిమా ఒక సంచలనం అని చెప్పవచ్చు.తెలుగు సినిమా స్థాయిని ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన సినిమా ఇదేనని ప్రతిఒక్కరూ చెబుతారు.

 Bahubali-wiil-release-agian, Bahubali, Cinema, Cinema, Thaters, Rajamouli, Prabh-TeluguStop.com

అంతకముందు టాలీవుడ్ అంటే.మన ఇండియాలోని సినీ అభిమానులకు మాత్రమే తెలుసు.

కానీ ఈ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది.

ఇతర దేశాల్లోని అనేక భాషల్లో విడుదలైన తెలుగు చిత్రం బాహుబలినే అని చెప్పవచ్చు.ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోగా.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది.

అవును.బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాల హిందీ వెర్షన్లను ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించాడు.ఘన విజయం సాధించిన ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాల్సిన అవసరం ఉందని, అందుకని తిరిగి తీసుకువస్తున్నట్లు కరణ్ జోహర్ వెల్లడించాడు.

కరణ్ జోహర్ ప్రకటనతో బాహుబలి టీమ్ ఆనంద వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube