ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. కారణం?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి.ఈ సినిమా ప్రపంచ స్థాయిలో విడుదల అయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది.దీంతో తెలుగు సినిమా ప్రపంచఖ్యాతి అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమా తర్వాత తెలుగులో తెరకెక్కే సినిమాలు ఎక్కువ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇకపోతే నెట్ ఫ్లిక్స్ భారత నేటివిటికి తగ్గట్టు అన్ని భాషల్లోనూ ఇక్కడి నటీనటులు దర్శకులతో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నాయి.ఇందులో భాగంగానే బాహుబలి వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.

 Bahubali Movie Web Series Has Stopped Reason,  Bhahubali, Web Series, Web Series-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన “ది రైజ్ ఆఫ్ శివగామి” అనే నవల ఆధారంగా బాహుబలి సిరీస్ ను ఎక్కువ ఎపిసోడ్లు రూపొందించాలని భావించారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై బాహుబలి దర్శకుడు రాజమౌళి సంప్రదించగా అతను దర్శకత్వం వహించక పోయిన తన సహకారం ఉంటుందని తెలియజేశారు.

ఈ క్రమంలోనే దీనిని డైరెక్ట్ చేయడానికి దేవకట్టాని తీసుకోవాలని రాజమౌళి సూచించారు.

Telugu Bahubali Web, Bhahubali, Devakatta, Rajamouli, Netflix, Praveen Sattaru,

అతను బాహుబలి సినిమాలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేయడంతో రాజమౌళి తనని సూచించినట్లు తెలిపారు.అదేవిధంగా ప్రవీణ్ సత్తార్ ని కూడా కొన్ని ఎపిసోడ్ లకు దర్శకత్వం వహించడానికి తీసుకున్నారు.ఇప్పటికే ఇద్దరు దర్శకులు కలసి స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారు.

Telugu Bahubali Web, Bhahubali, Devakatta, Rajamouli, Netflix, Praveen Sattaru,

ఇలా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత నెట్ ఫ్లిక్స్ కి మన వాళ్ళు ఇచ్చే అవుట్ పుట్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇంతటితో ఆపేశారు.ఈ క్రమంలోనే దేవాకట్టా మాట్లాడుతూ…ఈ సిరీస్ ని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా చేయాలని ఆలోచన.అయితే అలాంటి ప్రాజెక్టు చేయడానికి ఇద్దరు దర్శకులు సరిపోరని దీని కోసం ఎంతో సమయం కేటాయించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube