బాలీవుడ్ బ్యూటీకి బిర్యానీ పంపిన ప్రభాస్.. పోస్ట్ వైరల్?

పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కో స్టార్స్ కోసం తరచూ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడం మనం చూస్తూనే ఉన్నాం.ఏదైనా సినిమా సెట్ లో ఉన్నప్పుడు కూడా ప్రభాస్ అందరికీ ఫుడ్ అరేంజ్ చేస్తుంటారు.

 Bahubali Prabhas Sends Biryani Kareena Kapoor-TeluguStop.com

తాజాగా ఆది పురుష్ చిత్రంలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా బిర్యానీని పంపించారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సైఫ్ అలీ భార్య కరీనాకపూర్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే కరీనా కపూర్ స్పందిస్తూ బాహుబలి బిర్యాని పంపించాడంటే తప్పకుండా బాగుంటుంది అంటూ తను పంపించిన ఫుడ్ ఐటమ్స్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి అద్భుతమైన భోజనం పంపించినందుకు థాంక్యు ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చారు.

 Bahubali Prabhas Sends Biryani Kareena Kapoor-బాలీవుడ్ బ్యూటీకి బిర్యానీ పంపిన ప్రభాస్.. పోస్ట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిర్యానీ చూస్తుంటేనే ఆకలి వేయడంతో లొట్టలేసుకుంటూ తిన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Adhipurush, Biryani, Bollywood, Kareena Kapoor, Prabhas, Saif Alikhan, Tollywood-Movie

ఇలా కరీనా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన కరీనా కపూర్ కొంతకాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె అమీర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

#Biryani #Saif Alikhan #Kareena Kapoor #Adhipurush #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు