సమంతకు నిర్మొహమాటంగా నో చెప్పిన ప్రభాస్..?  

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రాధే శ్యామ్ సినిమాలో నార్మల్ లుక్ లో కనిపించిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నారు.

TeluguStop.com - Bahubali Prabhas Said No To Samantha Sam Jam Show

ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ ఒక విషయంలో సమంతకు నిర్మొహమాటంగా నో చెప్పారని తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.సామ్ జామ్ షో తొలి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ, రెండో ఎపిసోడ్ కు రానా, నాగ్ అశ్విన్ హాజరయ్యారు.

TeluguStop.com - సమంతకు నిర్మొహమాటంగా నో చెప్పిన ప్రభాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మూడో ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి టాక్ షోలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ షోలో పాల్గొనటానికి సామ్ జామ్ షో నిర్వాహకులతో పాటు, సమంత ప్రభాస్ ను సంప్రదించారని అయితే ప్రభాస్ మాత్రం సున్నితంగా సామ్ జామ్ షోలో పాల్గొననని చెప్పారని తెలుస్తోంది.

వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేస్తే ఆహా యాప్ కు సబ్ స్క్రైబర్లు పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం సామ్ జామ్ షోకు మంచి గుర్తింపు వస్తుందని షో నిర్వాహకులు భావించారు.అయితే ప్రభాస్ మాత్రం సినిమాలకు సంబంధిన పనుల వల్ల టాక్ షోకు హాజరు కాలేనని అన్నారని సమాచారం.ప్రభాస్ గతంలో చాలా తక్కువసార్లు మాత్రమే టాక్ షోలకు హాజరయ్యారు.

మరోవైపు ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతున్నాయి.

అందువల్లే ప్రభాస్ టాక్ షోలకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.ప్రదీప్ మాచిరాజు షోతో పాటు హిందీ షో కాఫీ విత్ కరన్‌ లో రాజమౌళి, రానాతో కలిసి ప్రభాస్ పాల్గొన్నారు.

ఆ తరువాత ఇప్పటివరకు ప్రభాస్ మరే షోలోను కనిపించలేదు.సమంతకు ఇప్పుడు నో చెప్పిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో సామ్ జామ్ షోకు హాజరవుతారేమో చూడాల్సి ఉంది.

#Radhe Shyam #SamanthaSam #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు