రష్యా టీవీ చానల్స్ లో ప్రసారం అయిన బాహుబలి  

Bahubali Movie Russian Language - Telugu Bahubali Movie Telecast In Russian Language, Indian Cinema, Rajamouli, Telugu Cinema, Tollywood

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి.రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఒకే సారి ఏడు భాషలకి పైగా రిలీజ్ అయ్యి సంచలన రికార్డులు నమోదు చేసింది.

 Bahubali Movie Russian Language

ఈ రెండు సినిమాలు కలిపి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రికార్డుని సొంతం చేసుకున్నాయి.ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో రెండు వేల కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని కొల్లగొట్టాయి.

ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో దంగల్ తప్ప మరే సినిమా బాహుబలి దరిదాపుల్లోకి రాలేదు.ఇక జపాన్ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

రష్యా టీవీ చానల్స్ లో ప్రసారం అయిన బాహుబలి-Movie-Telugu Tollywood Photo Image

అక్కడ మార్కెట్ లో బాహుబలి బొమ్మలు కూడా భాగా ఫేమస్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

తాజాగా రష్యా టీవీలోనూ బాహుబలి చిత్రం ప్రసారమైంది.అది కూడా రష్యా భాషలో సంభాషణలతో.

ఈ విషయాన్ని భారత్ లోని రష్యా దౌత్య కార్యాలయం స్వయంగా వెల్లడించింది.రష్యాలో భారత చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొంది.

రష్యా టీవీలో ఇప్పుడు ఏం ప్రసారమవుతుందో చూడండి.రష్యా డైలాగులతో బాహుబలి అంటూ రష్యా ఎంబసీ ట్వీట్ చేసింది.

ఇక రష్యాలో కూడా ఈ బాహుబలి కంక్లూజన్ ని మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bahubali Movie Russian Language Related Telugu News,Photos/Pics,Images..