సేల్స్ గర్ల్స్ గా మారిన బాహుబలి ఐటెం భామ! బ్యాంకాక్ మార్కెట్ లో ఆ పని చేస్తుంది  

బ్యాంకాంక్ వీధుల్లో సేల్స్ గర్ల్ గా మారిన నోరా ఫతేహి. .

Bahubali Item Girl Turned Street Sales Girl In Bangkok-

బాహుబలి సినిమా నటించిన నటులు అందరికి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో చిన్న పాత్రలు చేసిన వారు కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకొని అవకాశాలు పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి మొదటి భాగంలో ఐటమ్ సాంగ్స్ లో ఉన్న ముగ్గురు ముద్దుగుమ్మలలో నోరా ఫతెహీ కూడా ఒకరు..

సేల్స్ గర్ల్స్ గా మారిన బాహుబలి ఐటెం భామ! బ్యాంకాక్ మార్కెట్ లో ఆ పని చేస్తుంది-Bahubali Item Girl Turned Street Sales Girl In Bangkok

ఈ ఫారిన్ బ్యూటీ ఇండియాలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిందీలో బాలీవుడ్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇక తర్వాత బాహుబలి మొదటి పార్ట్ లో ఐటమ్ సాంగ్స్ తో ఒక్కసారిగా ఈ భామకి ఇమేజ్ పెరిగిపోయింది. దీంతో మరిన్ని అవకాశాలు ఈ భామ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ అవతారం ఎత్తింది. ఏకంగా క్రింద కూర్చొని బట్టలు అమ్మడం మొదలెట్టింది. ఇక ఆమె అలా బట్టలు అమ్మడం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే నోరా ప్రస్తుతం ఇందిలో స్ట్రీట్ డాన్సర్ అనే సినిమాలో నటిస్తూ ఉండగా, ఇలా బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ అవతారం ఎత్తడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఏదో ఫాషన్ గా అలా సేల్స్ గర్ల్ గా మారి బట్టలు అమ్మి ఉంటుంది అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.