‘బాహుబలి’ తర్వాత మహానటికే ఆ ఘనత       2018-05-26   04:49:07  IST  Raghu V

ఈమద్య కాలంలో స్టార్‌ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా కూడా కేవలం మొదటి రెండు వారాల్లోనే వీలైనంత వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సినిమాలను పట్టించుకునే నాధుడే ఉండటం లేదు. చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలు మూడవ వారంలో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక ఏదైనా ఒక సినిమా నాలుగు వారాల పాటు కంటిన్యూగా వసూళ్లు సాధించింది అంటే అది మామూలు సక్సెస్‌ కాదని చెప్పుకోవచ్చు. రికార్డు బ్రేకింగ్‌ చిత్రాల జాబితాలో ఆ చిత్రం ఉటుంది.

ఇప్పుడు మహానటి ఆ రికార్డు బ్రేకింగ్‌ చిత్రాల జాబితాలో నిలువబోతుంది. మహానటి చిత్రం మూడవ వారంకు ఎంటర్‌ కాబోతుంది. అయినా కూడా కలెక్షన్స్‌ భారీగా వస్తున్నాయి. మొదటి వారంలో కాస్త డల్‌గా ఉన్న కలెక్షన్స్‌ రెండవ వారంకు ఊపందుకున్నాయి. ఇక మూడవ వారంలో కూడా ఇదే స్థాయి వసూళ్లను సాధించడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు నమ్మకంగా చెబుతున్నారు. గత సంవత్సరం విడుదలైన బాహుబలి 2 మరియు అంతకు ముందు సంవత్సరం విడుదలైన బాహుబలి చిత్రాలు మొదటి మూడు వారాలు ఒకే రకమైన వసూళ్లను సాధించి రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు అదే తరహాలో మహానటి చిత్రం కూడా వసూళ్లను సాధిస్తుంది.

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంకు చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం ఊహించని కలెక్షన్స్‌ దక్కుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రికార్డులు బ్రేక్‌ అవుతూ ఈ చిత్రం ముందుకు దూసుకు వెళ్తుంది. భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తున్నందుకు ఈ చిత్ర నిర్మాతలు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం తమిళనాడు మరియు ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. పెట్టిన పెట్టుబడికి దాదాపు మూడు నాలుగు రెట్ల లాభాలు రావడం ఖాయం అంటూ సమాచారం అందుతుంది.

బాహుబలి సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్ల లాభాలను దక్కించుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో మహానటి చిత్రంకు కూడా నిర్మాతలు అంతే స్థాయిలో లాభాలను దక్కించుకుంటూ దూసుకు పోతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను అందుకుంటున్న మహానటి ముందు ముందు మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో అంటూ ట్రేడ్‌ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహానటిగా కీర్తి సురేష్‌ నటన అద్బుతం అని, ఆమె సినిమాకు జీవం పోసింది అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఒక గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.