బాహుబలి లో డైలాగ్ చెబుతుంటే ప్రభాస్ అలా అనేసరికి అవాక్కయ్యా...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలువురు పలువురి టాలీవుడ్ హీరోలకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా   మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ “కొసరాజు ఆదిత్య” గురించి సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే తే కొసరాజు ఆదిత్య ఒకప్పుడు తెర వెనుక డబ్బింగ్ మాత్రమే చెప్పేవాడు.

 Bahubali Actor Kosaraju Aditya Sensational Comments On Hero Prabhas Character And Attitude-TeluguStop.com

ప్రస్తుతం పలు చిత్రాలలో మరియు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ తెర ముందు బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా కొసరాజు ఆదిత్య బాహుబలి చిత్రంలో ఆస్థాన పండితుడి పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో యుద్ధ సమయంలో దున్నపోతును బలిచ్చే ససమయంలో వచ్చేటువంటి సన్నివేశాలలో తన డైలాగులు చెబుతుండగా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చి “డార్లింగ్ కొంచెం మెల్లగా డైలాగ్ చెప్పవా… ఎందుకంటే నా డైలాగులు మర్చిపోతున్నానని సరదాగా” అన్నాడట.

 Bahubali Actor Kosaraju Aditya Sensational Comments On Hero Prabhas Character And Attitude-బాహుబలి లో డైలాగ్ చెబుతుంటే ప్రభాస్ అలా అనేసరికి అవాక్కయ్యా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా సెట్లో అందరూ నవ్వుకున్నారని కొసరాజు ఆదిత్య చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కొంచెం కూడా గర్వం ఉండదని సినిమా సెట్ లో ప్రతి ఒక్కరిని చాలా గౌరవ మర్యాదలతో పలకరిస్తాడని అతడు నిజంగానే డార్లింగ్ అని ప్రభాస్ వ్యక్తితం గురించి చెప్పుకొచ్చాడు.

అయితే ఆరోజు బాహుబలి సెట్లో జరిగినటువంటి సంఘటన తనకు జీవితాంతం గుర్తు ఉంటుందని ఇలాంటి సంఘటనలు తన జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయని కూడా తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కొసరాజు ఆదిత్య తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “హిట్లర్ గారి పెళ్ళాం” అనే ధారావాహికలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే  కొసరాజు ఆదిత్య ఒకపక్క సినిమాలలో డబ్బింగ్ చెబుతూనే మరోపక్క పలువురు చిత్రాలు సీరియల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#BahubaliMovie #Prabhas #BahubaliActor #Kosaraju Aditya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు