దేవకన్యను తలపిస్తున్న అవంతిక

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా నుండి మరో పోస్టర్‌ విడుదలైంది.ఈ నెలారంభం నుండి జక్కన్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే.

 Bahubali 9th Poster :  Tamanna As ‘avanthika’-TeluguStop.com

అందులో భాగంగానే ఈ సినిమాలో అవంతిక పాత్ర పోషిస్తున్న తమన్నా పోస్టర్‌ను నేడు విడుదల చేశాడు.ఇప్పటికే అవంతిక పోస్టర్‌గా తమన్నా పుట్టిన రోజున విడుదల చేశాడు.

ఆ పోస్టర్‌లో తమన్నాను దేవకన్యలా చూపించి ఆకట్టుకున్నాడు.తాజాగా ఈ పోస్టర్‌లో కూడా అవంతిక ఒక దేవకన్యా అనే అనుమానం కలిగేలా చూపించాడు.

మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ‘బాహుబలి’ సినిమాలోని అవంతిక పాత్రకు బాగా సూట్‌ అయ్యిందని గతంలో రాజమౌళి చెప్పుకొచ్చాడు.ఈమె అందంలో మర్మం దాగి ఉంది అంటూ రాజమౌళి ఈ పోస్టర్‌ను పోస్ట్‌ చేసిన సందర్బంగా పోస్ట్‌ చేశాడు.

రాజమౌళి మాటలో అవంతిక అందం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్‌ను మే 31న మరియు సినిమాను జులై 10న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడంలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube