ప్రభాస్.ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు.
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే బాహుబలి చిత్రంకు ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి.ఎందుకంటే బాహుబలికి ముందు ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక సినిమా తీసే ప్రభాస్ బాహుబలి తర్వాత మూడేళ్లకు ఒక సినిమా తీస్తున్నాడు.
అలా మూడేళ్లకు తీసే ఒక సినిమాకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటది.
ఇంకా అలాంటి ప్రభాస్ ఈ కరోనా వైరస్ సమయంలో కూడా మూడు సినిమాలకు ఒకే అనేశాడు.
ఇక అందులో ఒక సినిమానే రాధేశ్యామ్.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సాహో చిత్రం తర్వాత తీసే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు.ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయమే విడుదల చేశారు.
అయితే ప్రభాస్ జీవితాన్ని మార్చేసిన చిత్రం బాహుబలి.ఈ సినిమా నిన్నటి నుంచి ట్విట్టర్ లో హాల్ చల్ చేస్తుంది.బాహుబలి మూవీ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.బాహుబలి వచ్చి ఇప్పటికే రెండేళ్లు అయ్యింది ఇప్పుడు ట్రెండ్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యం వెయ్యచ్చు.
కానీ బాహుబలి ట్రెండ్ అవ్వడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే? ప్రభాస్ ది ఈ వారం పుట్టినరోజు ఉంది.అందుకే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలో విడుదలవుతుంది.
ఇప్పటికే అమెరికాలో విడుదల అయినప్పటికీ ప్రభాస్ పై ఉన్న ప్రేమతో బాహుబలి 2 రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
ఇక అది కూడా మన దేశంలో కాదు అమెరికాలో.ఎంత ఇష్టం అయితే మాత్రం మల్లి బాహుబలి 2 రీ రిలీజ్ చెయ్యడం ఏంటి? అది కూడా కొన్ని వారాల పాటు సినిమాను ఆడించడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం మా హీరో రేంజ్ అది అంటూ ట్విట్టర్ లో హాల్ చల్ చేస్తున్నారు.