యూఏఈ బాటలోనే బహ్రెయిన్.. త్వరలో గోల్డెన్ వీసాలు..కండిషన్స్ ఏంటంటే..!!

పెట్టుబడులను, ప్రతిభా వంతులైన ప్రవాసులను ఆకర్షించేందుకు అన్ని దేశాలు ఏదో ఒక ప్రయోజనాలని కల్పిస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే కేవలం వలస కార్మికులే అత్యధికంగా వెళ్ళే యూఎఈ దేశం తమ దేశంలో కూడా అత్యంత నిపుణులైన వారికి స్థానం కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ప్రకటనలు చేస్తోంది.

 Bahrain On The Way To Uae  Golden Visas Soon Conditions Are , Bahrain, Uae  Gold-TeluguStop.com

అంతే కాదు గోల్డెన్ వీసా పేరుతో పలు రంగాలలో సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసాలని ప్రధానం చేస్తోంది.ఇప్పటి వరకూ భారత సంతతికి చెందిన ఎంతో మంది వ్యాపార వేత్తలు, ప్రముఖులకు యూఎఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలని అందించింది అంతేకాదు.

భారత్ లోని ప్రముఖ సినీనటులకి కూడా గోల్డెన్ వీసాలను అందించింది యూఏఈ.అయితే మరో అరబ్బు దేశమైన బహ్రెయిన్ సైతం యూఎఈ బాటలోనే నడుస్తోంది.

తమ దేశంలో కూడా విదేశీ పెట్టుబడులు ఉండాలని, నిపుణులైన వారికి అన్ని అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది.ఇందులో భాగంగానే గోల్డెన్ వీసాలని ప్రవేశపెడుతోంది.

తమ దేశ ఆర్ధిక వ్యవస్థను మరింత బలపరిచే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.ఈ క్రమంలోనే ఆదేశ అంతర్గత వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది.

ఈ గోల్డెన్ వీసాలను అందించడం ద్వారా బహ్రెయిన్ లో పనిచేసే హక్కును అలాగే ఎన్నో సార్లైనా వెళ్లి వచ్చే విధంగా అవకాశాలు కల్పిస్తోంది.అంతే కాదు ఈ గోల్డెన్ వీసా కుటుంభ సభ్యులకు బహ్రెయిన్ నివాస సౌకర్యం కల్పిస్తోంది.ఈ గోల్డెన్ వీసాను పొందేందుకు అర్హతలు ఏంటంటే.

– దరఖాస్తు దారుడు బహ్రెయిన్ లో 5 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ఉండి ఉండాలి

– బహ్రెయిన్ లో సుమారు రూ.4 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉండాలి

– నెలకు జీతం రూ 3.95 లక్షలు కలిగి ఉండాలి

– పదవీ విరమణ పొందిన వారైతే వారికి నెలకు రూ.9 లక్షలు జీతం పొందుతూ ఉండాలి

– ఈ వీసా వచ్చిన తరువాత ఏడాదిలో సుమారు 90 రోజులు బహ్రెయిన్ లో ఉండాలి.

Bahrain launches Golden Residency Visa Bahrain Golden Visa Rules

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube