Maharashtra Shahir :అప్పుడు సారంగదరియా ఇప్పుడు బహర్ల హ మధుమాస్.. ఈ పాటకు రీల్స్ వరద పోటెత్తుతోందిగా!

సోషల్ మీడియా( Social media ) వాడకం పెరిగిపోయిన తర్వాత సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను బాగానే ఉపయోగిస్తున్నారు.చాలామంది ఈ సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న టాలెంట్ ని బయటపెడుతూ గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు.

 Baharla Ha Madhumas Goes Viral In Youtube-TeluguStop.com

అయితే సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ సినిమాకు సంబంధించిన సాంగ్ ట్రెండ్ అయినా కూడా ఆ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ స్టెప్పులు వేసి అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Telugu Baharlaha, Sai Pallavi, Tollywood, Youtube Reels-Movie

ఇటీవల కాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది.భాషతో సంబంధం లేకుండా ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రీల్స్ వర్షం కురిపిస్తున్నారు.మొన్నటి వరకు సారంగదరియా పాటకు రీల్స్ చేశారు.

ఆ తర్వాత పుష్ప సినిమాలోని సామీ సామీ పాటకు స్టెప్పులు వేశారు.ప్రస్తుతం బహర్లా హ మధుమాస్ పాటకు రీల్స్ చేసి అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ పాట ఎక్కువగా వినిపిస్తోంది.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు.

Telugu Baharlaha, Sai Pallavi, Tollywood, Youtube Reels-Movie

కేదార్‌ షిందే దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రం మహారాష్ట్ర షాహిర్‌( Maharashtra Shahir )ఇందులో అంకుష్ చౌదరి, సనా కేదార్‌ షిందే కీలక పాత్రలు పోషించారు.ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇందులో బహర్లా హ మధుమాస్‌ పాట టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.యూట్యూబ్‌( Youtube ), ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే వరుస పెట్టి రీల్స్‌ వచ్చేస్తున్నాయి.

పెద్దా, చిన్నా తేడా లేదు వయసుతో సంబంధం అసలే లేదు.కాగా అజయ్‌, అతుల్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను అజయ్‌ గోగావాలే, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube