రాజమౌళిని వెక్కిరించే పాటకు 10 కోట్ల వ్యూసా?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి.

 Smita's 'baha Kilikki' Hits 100 Million,baha Kilikki Song, Youtube, Singer Smith-TeluguStop.com

రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే రాజమౌళిని సైతం పలు విషయాల్లో విమర్శించే వాళ్లు ఉన్నారు.

అయితే ప్రత్యక్షంగా విమర్శలు చేయలేక పరోక్షంగా విమర్శలు చేస్తూ ఉంటారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో కిలికి భాష గురించి మనందరికీ తెలిసిందే.

కాలకేయుడు మాట్లాడే భాష కోసం అప్పట్లో కొత్త లిపినే సృష్టించింది జక్కన్న టీం.బాహుబలి సినిమా విడుదలైన సమయంలో కిలికి భాషకు నివాళి అంటూ సింగర్ స్మిత బహాకిలికి పాటలో నటించింది.అర్థం పర్థం లేని లిరిక్స్ తో ఉన్న ఆ పాట ట్యూన్ బాగుండటంతో పాటు సినిమా పాటను తలపించే రేంజ్ లో ఉండటంతో ప్రజలకు బాగానే రీచ్ అయింది.

ఇటీవల ఆ పాట పది కోట్ల మార్కును అందుకుంది.2015 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన యూట్యూబ్ లో ఈ వీడియో అప్ లోడ్ అయింది.బాహుబలి టీంకు నివాళి అంటూ స్మిత తీసిన ఈ వీడియోలో బాహుబలిలో కాలకేయుడిగా కనిపించిన ప్రభాకర్ కూడా నటించాడు.

సాధారణంగా సినిమా స్టార్లు మాత్రమే ఇలాంటి అరుదైన ఫీట్ ను సాధించగలరు.అయితే సింగర్ స్మిత మాత్రం సులభంగానే ఈ ఘనత అందుకుంది.

అయితే ఈ రికార్డు రాజమౌళి ఫ్యాన్స్ కు మాత్రం నచ్చడం లేదు.రాజమౌళిని వెక్కిరిస్తూ తీసిన పాట కావడంతో ఈ పాట రికార్డుల విషయంలో రాజమౌళి అభిమానులు ఎలాంటి కామెంట్లు చేయడం లేదు.

ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఒకప్పుడు లక్షల సంఖ్యలో అభిమానులకు చేరువైన స్మిత గత కొన్నేళ్లుగా కొంత సైలెంట్ గానే ఉండటం గమనార్హం.హిట్ సినిమా పాటలను తనదైన శైలిలో రీమేక్ చేసి స్మిత గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube