హార్డ్ డిస్క్ ఆర్డర్ చేస్తే.. బట్టల సబ్బులు డెలివరీ వచ్చాయట..!

ఒక్కోసారి మనం ఆర్డర్ ఇచ్చిన వస్తువులకు బదులుగా వేరే వస్తువులు రావడం ఈమధ్య తరచు చూస్తూనే ఉన్నాం.ప్రముఖ ఈ కామర్స్ షాపింగ్ సంస్థ అమెజాన్ నుండి కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఆర్డర్ ఇచ్చాడు బద్వేల్ కు చెందిన ప్రదీప్.అయితే ఆర్డర్ డెలివరీ వచ్చింది.3,099 రూపాయలు ఇచ్చి ఆ పార్శిల్ తీసుకోగా అనుమానం వచ్చిన ప్రదీప్ ఆ పార్శిల్ అన్ బాక్సింగ్ ను వీడియో తీశాడు.అయితే అతను అనుమానించినట్టుగానే అందులో హార్డ్ డిస్క్ లేదు.

 Badvel Person Ordered Hard Disk But Amazon Delivered Soaps To Him-TeluguStop.com

హార్డ్ డిస్క్ బదులుగా అందులో బట్టల సబ్బులు ఉన్నాయట.3000 ల రూపాయల హార్డ్ డిస్క్ ఆర్డర్ ఇస్తే 10 రూపాయల బట్టల సబ్బులు పంపించారంటూ అమేజాన్ డెలివరీ బోయ్ ను అడిగితే తనకు సంబంధం లేదని చెప్పాడట.అలా చెప్పడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై అమెజాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని ప్రదీప్ చెబుతున్నాడు.ఆన్ లైన్ షాపింగ్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

 Badvel Person Ordered Hard Disk But Amazon Delivered Soaps To Him-హార్డ్ డిస్క్ ఆర్డర్ చేస్తే.. బట్టల సబ్బులు డెలివరీ వచ్చాయట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతున్నా సరే కస్టమర్స్ కు అందివాల్సిన పార్శిల్ బదులుగా ఈ కామర్స్ సంస్థలు వేరొక పార్శిల్స్ ను పంపిస్తూ షాక్ ఇస్తున్నాయి. అయితే ఈ మిస్ గైడ్ ఆర్డర్స్ పై ఈ కామర్స్ సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

#Badvel #Hard Disk #Pradeep #OnlineShopping #ECommerce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు