ఆమె కోసం పెద్దాసుపత్రి చిన్న గుడిసెలోకి వచ్చింది. ఇలాంటి అధికారులు కావాలి..  

Badradri District Collector Great Humanity-district Collector,great Humanity,himoglobin,hospitals,కొత్తగూడెం,హాస్పిటల్‌

మారుతున్న పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకునేందుకు కొందరు గిరిజనులు ఆసక్తి చూపించరు. కొన్ని కోయ జాతి వారు మరియు కొన్ని రకాల గిరిజన జాతుల వారు ఎప్పుడు కూడా హాస్పిటల్‌కు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం ఎరుగరు. మానవ జాతి ముందుకు వెళ్తున్నా వారు మాత్రం తమ పద్దతి మారదు అంటూ ఉంటారు..

ఆమె కోసం పెద్దాసుపత్రి చిన్న గుడిసెలోకి వచ్చింది. ఇలాంటి అధికారులు కావాలి..-Badradri District Collector Great Humanity

హాస్పిటల్‌కు రాని వారి కోసం కొన్ని స్వచ్చంద సంస్థలు హాస్పిటల్స్‌నే వారి వద్దకు తీసుకు వెళ్తూ ఉంటాయి. తాజాగా భద్రాద్రి జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటన జిల్లా కలెక్టర్‌ ఔదార్యంను, గొప్పదనంను తెలియజేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి జిల్లా శివారు ప్రాంతంలోని ఒక గిరిజన ఏరియాలో ఒక స్వచ్చంద సంస్థకు చెందిన డాక్టర్‌ అక్కడి వారికి పరీక్షలు చేస్తున్నాడు. ఒక మహిళ గర్బవతి అని తెలిసి ఆమెకు రక్త పరీక్ష నిర్వహించాడు.

అయితే ఆమె రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతం చూసి అవాక్కయ్యాడు. 9 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్‌ కేవలం 3 శాతం మాత్రమే ఉందట. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి అన్నాడు. కాని ఆమెకు హాస్పిటల్‌కు వెళ్లే ఆలోచన లేదు..

హాస్పిటల్‌కు వెళ్లకుంటే చనిపోతావు అంటూ బెదిరించి భయపెట్టి ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం జరిగింది.

కొత్తగూడెం హాస్పిటల్‌లో ఆమెకు రక్తం ఎక్కించారు. మూడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

కాని రాత్రికి రాత్రే ఆమె హాస్పిటల్‌లో ఉండలేను అంటూ అక్కడి నుండి వెళ్లి పోయింది. ఆ తర్వాత రోజు మళ్లీ తీసుకు వచ్చారు. అప్పుడు కూడా వెళ్లి పోయింది.

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించి వారిని హాస్పిటల్‌కు తీసుకు రావడం కన్నా వారి వద్దకే హాస్పిటల్‌ తీసుకు వెళ్లడం మంచిది అంటూ వైధ్యులను మరియు అందుకు సంబంధించిన పరికరాలను ఆంబులెన్స్‌లో పంపించడం జరిగింది. ఎట్టకేలకు ఆమె డెలివరి అయ్యింది. ఆమె బిడ్డకు జన్మనివ్వడంతో కథ సుఖాంతం అయ్యింది.

తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ సిబ్బంది అంతా వెనక్కు వచ్చేశారు.