క‌రోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి..!

తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతలు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

 Badrachalam, Ex Mla, Sunnam Rajaih, Die-TeluguStop.com

ఈ వైరస్ కారణంగా ప్రముఖ నేతలు కూడా ప్రాణాలను కోల్పోయారు.తాజాగా సీపీఎం సీనియ‌ర్ నేత‌, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) మృతి చెందారు.

రాజయ్య గత కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.అతని కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ ఆసుపత్రి సిబ్బంది అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

అయితే రాజయ్య భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం పార్టీ నుండి 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా కుంజా సత్యవతి చేతిలో పరాజయం పొందారు.రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

రాజయ్య సొంతూరు ఆంధ్రాలో ఉండటంతో.గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.

కరోనా వైరస్ నిబంధనల మేరకు ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించనున్నారు.పలువురు నేతలు రాజయ్య మృతికి సంతాపం తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube