కరోనా పాజిటివ్.. థాయిలాండ్ ఓపెన్ సిరీస్ నుంచి సైనా నెహ్వాల్ అవుట్..!  

ప్రముఖ భారతీయ షట్లర్ సైనా నెహ్వాల్, హెచ్.ఎస్ ప్రణయ్ కరోనా వైరస్ బారిన పడ్డారు.

TeluguStop.com - Badminton Player Saina Nehwal Tested Positive Yonex Thailand Open 2021

గతంలో వీళ్ళిద్దరూ కరోనా బారిన పడ్డారు కానీ రికవర్ అయ్యారు.మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడడంతో “థాయిలాండ్ ఓపెన్ 2021” నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

థాయిలాండ్ ఓపెన్ మంగళవారం రోజు జరగనున్నది.భారతీయ షట్లర్స్ జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న థాయిలాండ్ ఓపెన్ లో పాల్గొనాల్సి ఉంది.

TeluguStop.com - కరోనా పాజిటివ్.. థాయిలాండ్ ఓపెన్ సిరీస్ నుంచి సైనా నెహ్వాల్ అవుట్..-General-Telugu-Telugu Tollywood Photo Image

టయోటా థాయిలాండ్ ఓపెన్ లో జనవరి 19 నుంచి 24వ తేదీ వరకు పాల్గొనాల్సి ఉంది.హెచ్ఎస్బిసి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో జనవరి 27 నుంచి 31 వరకు పాటిస్పేట్ చేస్తారు.

అయితే బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెందిన ఒక సోర్స్ సమాచారం వెల్లడిస్తూ.“సైనా నెహ్వాల్ తో పాటు ప్రణయ్ సోమవారం రోజు కరోనా వైరస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది.వీళ్లిద్దరూ కూడా బ్యాంకాక్ ఆస్పత్రిలో పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సి ఉంది.పారుపల్లి కశ్యప్ కూడా కచ్చితంగా టెస్టు చేయించుకోవాలి ఎందుకంటే అతను ఇద్దరికీ క్లోజ్ కాంటాక్ట్ కాబట్టి” అని చెప్పుకొచ్చింది.

అయితే వీళ్ల ముగ్గురిని మినహాయించి మిగతా ఇండియన్ క్రీడాకారులు థాయిలాండ్ ఓపెన్ లో పాటిస్పేట్ చేస్తారు.

ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో నే థాయిలాండ్ ఓపెన్ ప్రారంభమయింది.దీంతో ప్రముఖ భారతీయ షటిల్ ఆటగాళ్ళు తమ రాకెట్ సత్తా చూపించేందుకు రెడీ అయిపోతున్నారు.థాయిలాండ్ ఓపెన్ వేదికగా సైనా నెహ్వాల్ గొప్ప ప్రదర్శన ఇవ్వాలనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు కరోనా వైరస్ బారిన పడ్డారు.

మలేషియన్ షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా నెహ్వాల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.అయితే తాను కరోనా వైరస్ బారిన పడ్డానని త్వరలో జరగబోయే మ్యాచ్ లో ఆడ లేక పోతున్నాను అని సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఆమెతోపాటు భర్త కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు కానీ ఇంకా ఫలితాల నివేదికలు బయటకు రాలేదు.ఇకపోతే కరోనా దెబ్బకు దాదాపు 300 రోజుల పాటు షటిల్ ఈవెంట్స్ అన్నీ మూతపడ్డాయి.

మొదటిగా థాయిలాండ్ ఓపెన్ స్టార్ట్ అయింది.

#YonexThailand #COVID-19 #Saina Nehwal #P Kashyap #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Badminton Player Saina Nehwal Tested Positive Yonex Thailand Open 2021 Related Telugu News,Photos/Pics,Images..