ఈమెను ప్రతి అమ్మాయి ఆదర్శంగా తీసుకోవాలి... ఏం కష్టం వచ్చిందని ఏడవాలి, నేను అస్సలు ఏడవను  

Badass Bengali Bride Shuns Outdated Ritual At Own Wedding-

పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి అత్తవారింటికి వెళ్లే సమయంలో ఏడుస్తుంది.ఎంత ప్రేమ వివాహం చేసుకున్నా, చేసుకున్న వాడిని ఎంతగా ప్రేమించినా, ఎంత దగ్గర బందువును చేసుకున్నా, అత్త ఎంత మంచిది అయినా కూడా పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో ప్రతి అమ్మాయి కూడా ఏడ్వడం అనేది చాలా అంటే చాలా చాలా కామన్‌.అయితే ఈ బెంగాళీ యువతి మాత్రం అప్పగింతల సమయంలో బందువులు ఏడవమని అడిగినా కూడా నేను ఏడవను, ఎందుకు ఏడవాలి అంటూ నవ్వుతూ అప్పగింతలు ఇచ్చేసి భర్తతో వెళ్లి పోయింది.

Badass Bengali Bride Shuns Outdated Ritual At Own Wedding--Badass Bengali Bride Shuns Outdated Ritual At Own Wedding-

ఈ పెళ్లి అప్పగింత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.వారం రోజుల్లోనే ఈ వీడియో ఏకంగా 50 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Badass Bengali Bride Shuns Outdated Ritual At Own Wedding--Badass Bengali Bride Shuns Outdated Ritual At Own Wedding-

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్‌కత్తా బేగంపూర్‌కు చెందిన మూమ్‌ అనే 24 ఏళ్ల యువతి వివాహం తాజాగా జరిగింది.పెళ్లి తర్వాత బెంగాళీ సాంప్రదాయం ప్రకారం అప్పగింతల సమయంలో వదువు ఏడుస్తూ ఉండాలి, ఆమె బందువులు ఆమెను బుజ్జగిస్తూ ఆమెను ఏడుపు మాన్పించేందుకు ప్రయత్నిస్తూ అబ్బాయి చేతిలో పెట్టి పంపిస్తారు.కాని ఇక్కడ సీన్‌ రివర్స్‌ జరిగింది.మూమ్‌ ఏడవకుండా నవ్వుతూ అప్పగింతలు ఇస్తుండగా, ఆమె తరపు బందువులు మాత్రం ఏడుస్తూ కనిపించారు.

ఏడుస్తున్న వారిని ఏడవద్దంటూ నవ్వుతూ మూమ్‌ అక్కడి వారిని ఆశ్చర్య పర్చింది.

పద్దతి ప్రకారం ఏడవమని కొందరు అన్నా కూడా నేను ఎందుకు ఏడవాలి, అసలు నాకు ఏం కష్టం వచ్చిందని ఏడవాలి అంటూ గట్టిగా చెప్పింది.నేను అస్సలు ఏడవను, నాకు ఏడవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పింది.

మూమ్‌ను ప్రతి ఒక్క అమ్మాయి ఆదర్శంగా తీసుకోవాలి.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో రకరకాలుగా కామెంట్స్‌ వస్తున్నాయి.పెళ్లి కూతురు అప్పగింతల సమయంలో ఏడవడం, ఆ తర్వాత అబ్బాయిని ఏడిపించడం చాలా కామన్‌.

అయితే ఈమె ఇప్పుడు ఏడవకుండా, ఆ తర్వాత పెళ్లి కొడుకును ఏడిపిస్తుందేమో అంటూ జోకులు వేస్తున్నారు.మొత్తానికి మూమ్‌ ఒక్కసారిగా సెలబ్రెటీ అయ్యింది.

https://www.facebook.com/100008422146416/videos/vb.100008422146416/2079429952347723/?type=2&video_source=user_video_tabమీరు అమ్మాయిలు అయినా లేదంటే మీకు అక్క చెల్లి ఉంటే వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ విషయాన్ని తప్పకుండా షేర్‌ చేయండి.