టీడీపీకి గ‌డ్డు కాలం.. చంద్ర‌బాబుకు ఇది పెద్ద ప‌రీక్షే

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌వు.ఈ విష‌యం టీడీపీని చూస్తుంటేనే అర్థం అవుతోంది.

 Bad Times For Tdp .. This Is A Big Test For Chandrababu, Chandrababu, Tdp-TeluguStop.com

ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పుడు ఏపీలో దారుణ ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది.మ‌రీ ముఖ్యంగా వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ పార్టీని కోలుకోకుండా చేస్తున్నాయి.

ఇప్ప‌టికే సొంత పార్టీ నుంచే వ‌స్తున్న విమ‌ర్శ‌లు చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారితే మ‌రోవైపు జంపింగ్ లు, జ‌గ‌న్ దూకుడు అన్నీ క‌లిసి టీడీపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌కం అయ్యేలా చేస్తున్నాయి.గ‌త చ‌రిత్ర‌లో టీడీపీకి ఇలాంటి ప‌రిస్థితి రాలేదు.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పంలో వ‌రుస ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు.దీన్నే టీడీపీ నేత‌లు బూచిగా చూపుతూ ఆయ‌న్ను విమ‌ర్శిస్తున్నారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎవ‌రినీ గెలిపించ‌లేని చంద్ర‌బాబు ఇక త‌మ‌నేం గెలిపిస్తాడంటూ త‌మ్ముళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఒక ఎత్తు అయితే కుప్పంలో ఓడిపోవ‌డం మ‌రో ఎత్తు అనే చెప్పాలి.

వెర‌సి చంద్ర‌బాబుకు, టీడీపీకి గ‌డ్డు కాలం న‌డుస్తుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దేమో.

Telugu Ap Assembley, Ap, Badtimes, Chandrababu, Cm Jagan, Ysrcp-Telugu Political

అస‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి స‌గం కాలం మాత్ర‌మే గ‌డిచింది.ఇంకా రెండున్న‌రేండ్లు మిగిలే ఉన్నాయి.ఆ రెండున్న‌రేండ్లు పార్టీని ఎలా న‌డిపిస్తారనేది చంద్ర‌బాబుకు పెద్ద ప్ర‌శ్న అనే చెప్పాలి.ఎందుకంటే రెండున్న‌రేండ్ల‌లో జ‌గ‌న్ దూకుడు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.ఇప్ప‌టికే టీడీపీ నుచి 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీ గూటికి చేరిపోయారు.ఇలాటి క్లిష్ట ప‌రిస్థితుల్లో నాయ‌కుల‌ను కాపాడుకోవ‌డం, పార్టీని న‌డిపించ‌డం అంటే 71ఏండ్ల వ‌య‌సులో చంద్ర‌బాబుకు పెద్ద ప‌రీక్షే.

ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థిల‌ను ఎదుర్కోవాలంటే చాలా ఓపిక కావాలి.మ‌రి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube