సర్కారు వారి పాట సినిమాకు బ్యాడ్ సెంటిమెంట్.. మే నెలలో సినిమాలు ఫ్లాప్ అంటూ?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సర్కారు వారి పాట తెరకెక్కుతుండగా ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని మొదట ప్రకటన వెలువడింది.

 Bad Sentiment For Star Hero Mahesh Babu Sarkaru Vari Pata Movie But Details, Sar-TeluguStop.com

అయితే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మూవీ రేసులో ఉండటం సర్కారు వారి పాట షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీకి పోస్ట్ పోన్ అయింది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ మార్చి 25వ తేదీకి ఫిక్స్ కావడంతో పాటు వేర్వేరు కారణాల వల్ల సర్కారు వారి పాట షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడంతో ఈ సినిమా మే 12వ తేదీకి వాయిదా పడింది.

అయితే మేలో విడుదలైన మహేష్ బాబు సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నారు.

మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నిజం సినిమా మే నెలలోనే విడుదలైంది.

Telugu Bad, Brahmotsavam, Parashuram, Mahesh Babu, Result, Nani, Nijam-Movie

మే నెల 23వ తేదీన విడుదలైన నిజం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.మహేష్ బాబు హీరోగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన నాని సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా 2004 సంవత్సరం మే నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది.మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రహ్మోత్సవం కూడా మే నెలలోనే విడుదలైంది.

Telugu Bad, Brahmotsavam, Parashuram, Mahesh Babu, Result, Nani, Nijam-Movie

బ్రహ్మోత్సవం సినిమా సీరియల్ ను తలపించేలా ఉందని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.మే నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.అయితే మహేష్ నటించిన మహర్షి సినిమా మాత్రం మే నెల 9వ తేదీన విడుదలై సక్సెస్ సాధించింది.ఈ సక్సెస్ సెంటిమెంట్ వల్లే సర్కారు వారి పాట మేకర్స్ ఈ సినిమాను మేలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube