విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌... హీరో సూర్య ఎంత పని చేశాడు  

Bad News For Vijay Devarakonda Fans-

విజయ్‌ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’.ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి తాకేలా ఉన్నాయి.గీత గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా అవ్వడంతో పాటు, విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం ప్రస్తుతం ఆకాశంలో ఉంది.ఆ కారణంగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రం భారీ ఎత్తున మే 31న విడుదల చేయాలని భావించారు.

Bad News For Vijay Devarakonda Fans-

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డియర్‌ కామ్రేడ్‌ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మొదటి నుండి అనుకుంటున్నట్లుగా ఈ చిత్రాన్ని జూన్‌లోనే విడుదల చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Bad News For Vijay Devarakonda Fans-

మే 31న విడుదల చేయకుండా క్యాన్సిల్‌ చేయడానికి ప్రధాన కారణం తమిళ హీరో సూర్య అంటూ టాక్‌ వినిపిస్తుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే మే 31నే సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కాని సూర్య నటిస్తున్న ఎన్జీకే సినిమాను కూడా అదే తేదీలో విడుదల చేయాలని భావిస్తున్నారు.తమిళనాట ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఇలాంటి సమయంలో ఆ సినిమాతో పోటీగా వస్తే అక్కడ కనీసం థియేటర్లు కూడా దొరికే పరిస్థితి లేదు.అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారు.

‘ట్యాక్సీవాలా’ చిత్రం తర్వాత గ్యాప్‌ తీసుకుని వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ పిచెక్కి పోయి ఉన్నారు.సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు.

దాంతో సినిమా మరింతగా ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్‌కు నచ్చడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో సూర్య ‘ఎన్జీకే’ చిత్రం వల్ల వాయిదా పడడం అనేది ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే విషయమే

తాజా వార్తలు

Bad News For Vijay Devarakonda Fans- Related....