ట్రంప్ కు బ్యాడ్ న్యూస్...హెచ్-1బీ వీసా దారులకు గుడ్ న్యూస్..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వలస వాసులు, అలాగే హెచ్ -1 బీ వీసా ల జారీలపై ఎంతో విమర్శనాత్మక, ఆంక్షలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు.అయితే తాజాగా వాటిలో కొన్నిటిపై కోర్టు అభ్యంతరం తెలుపుతూ కొట్టివేసింది.

 Bad News For Trump And Good News For H1b Visa Holders, Us President Donald Trump-TeluguStop.com

కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది భారతీయ ఐటీ నిపుణులకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.ఈ ఏడాది చివరి వరకూ కూడా హెచ్-1బీ వీసాలను రద్దు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత అమెరికాలోని బడా ఐటీ కంపెనీలు ట్రంప్ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించిన విషయం విధితమే.అయితే

ఐటీ కంపెనీలు కోర్టులో వేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకువస్తానని చెప్పుకొచ్చిన ట్రంప్ సర్కార్ ఆ విషయంలో మాత్రం ఎక్కడా కూడా పారదర్శకత ప్రదర్శించలేదనేది స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.ఒక వేళ మార్పులు తీసుకురావాలని అనుకుంటే ప్రజలతో చర్చించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రద్దు చేశారని ఇది సరైన చర్యలు కావాలని కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ తెలిపారు

Telugu Calinia, Visa, Judgejeffrey, Donald Trump-Telugu NRI

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న హడావుడి ఉపయోగ కరంగా లేని నిర్ణయాలు కొట్టేస్తున్నానని విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలలో విదేశీయుల నియామకంపై ట్రంప్ విధించిన ఆంక్షలు చెల్లవంటూ ఈ రెండు విషయాలను కొట్టేస్తూ తీర్పు చెప్పారు.డిసెంబర్ 7 నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయడానికి లేదని, ఇకపై ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా సంభందిత సంస్థలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులతో పాటు ఐటీ కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నికల విషయంలో కోర్టులో వేస్తున్నా వాజ్యాలు కొట్టేస్తున్న తరుణంలో తాజాగా ట్రంప్ వీసాలపై విధించిన ఆంక్షల విషయంలో కూడా చుక్కెదురవడం ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube