ఫ్యాన్స్‌కు కేజీఎఫ్ బ్యాడ్ న్యూస్  

Bad News For Kgf Fans-kgf Chapter 2,sandalwood Movie News,yash

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు యశ్.

Bad News For KGF Fans-Kgf Chapter 2 Sandalwood Movie Yash

కేజీఎఫ్ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 అంటూ వస్తున్న సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఈ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఓ బ్యాడ్ న్యూస్‌ను వెల్లడించింది.గతంలో ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్, ఇప్పుడు అది సాధ్యం కాదని చెబుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యమవుతుండటంతో ఈ సినిమాను ఆగష్టు నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.మరి ఆగష్టు నెలలోనైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది డౌటే అంటున్నారు పలువురు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు