కమల్ హాసన్ కు ఎదురైన చేదు అనుభవం..!

భారతీయ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ గురించి తెలియని వారెవరూ లేరు.అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగంలో రెండు వైపులా సరిసమాన బాధ్యతలను మోస్తూ వస్తున్నాడు కమల్.

 Bad Experience To Kamal Haasan In Election Campaign With Womens   Kamal Haasan,-TeluguStop.com

అంతేకాకుండా రాజకీయ పరంగా ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మూడో కూటమి ఏర్పాటు గురించి గట్టిగానే వాదిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా కమల్ హాసన్ కు చేదు అనుభవం ఎదురైంది.

మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఇదివరకే మూడో కూటమి గురించి గట్టి నమ్మకాన్ని తెలియ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రంగంలో దిగగా ప్రజలకు ప్రచారం చేసే సమయంలో చేదు అనుభవం ఎదురైంది.ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన కమల్ హాసన్ ను మహిళలు అడ్డుకున్నారు.

ఆయనను ప్రజలు కలవకుండా కేవలం టీవీలో షో చేసి వెళ్లిపోయారని మహిళా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Kamal Haasan, Makkalneedhi, Womens-Movie

అంతేకాకుండా ఇక్కడ గెలిచి రేపు చెన్నై వెళ్ళిపోతే మేం మాకున్న సమస్యలు ఎవరికి చెప్పాలి అంటూ ప్రశ్నించారు.ఇక ఈ విషయం గురించి గట్టిగా స్పందించిన కమల్ హాసన్ నాకంటే ముందు ఇక్కడి నుంచి పోటీ చేసిన ఇతర పార్టీల నేతలను ఇలా ఎందుకు నిలదీయలేదని మహిళ ఓటర్లను ప్రశ్నించారు.ఈ విషయాన్ని గమనించినట్లయితే కమల్ కూడా వారితో గట్టిగానే వాగ్వాదం చేశాడని అర్థమవుతుంది.

కానీ మహిళలు అంతటితో ఆగక దీనికి బదులుగా మా నియోజకవర్గంలో పోటీ చేసే ఎవరినైనా ఇలాగే నిలదీస్తామంటున్నారు.కమల్ హాసన్ కి ఎప్పుడు ఎదురు కానీ చేదు అనుభవం ఈ నియోజకవర్గం లో ప్రచారం చేస్తుండగా ఎదురయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube