నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం

Back To School Program Under The Auspices Of Knots

తెలంగాణలో పేద పిల్లలకు అండగా నాట్స్ బోధన్, తెలంగాణ: నవంబర్:26 అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విసృత్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 Back To School Program Under The Auspices Of Knots-TeluguStop.com

దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ మండలంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్ధులకు బ్యాక్ ప్యాక్ లు, నోట్ పుస్తకాలు, ,పలక‌లు, పెన్నులు, పెన్సిల్‌లు జామెట్రీ బాక్స్‌లను పంపిణీ చేసింది.నాట్స్ సభ్యులు శశాంక్ కోనేరు, గోపి పాతూరి స్థానిక పాఠశాలలతో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఎత్తోండ, సాలంపాడు, అక్బర్ నగర్ పాఠశాలల్లో విద్యార్ధులకు 300 బ్యాక్ ప్యాక్‌లను అందించారు.

 Back To School Program Under The Auspices Of Knots-నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్ధుల కోసం నాట్స్ చేసిన ఈ మంచి ప్రయత్నం ఇక ముందు కొనసాగుతుందని విద్యార్ధులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే కోరారు.

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేలు ఈ కార్యక్రమానికి తొలి నుంచి మద్దతు అందించడంతో పాటు నాట్స్ సాయం చివరి వరకు చేరేలా పర్యవేక్షణ చేశారు.బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికాలో మాత్రమే కాకుండా ఇండియా లో మారు మూల గ్రామాల్లో చేస్తున్న సేవలని కొనియాడారు.

నాట్స్  సపోర్టర్స్ అయిన శశాంక్ కోనేరు మరియు గోపి పాటూరి లను అభినందించారు.

#Vijay Shekhar #KnotsBoard #KnotsShashank #SchoolProgram

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube